Anantapur Seb Police Station Ysrcp Corporator,సెబ్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ కార్పొరేటర్ దౌర్జన్యం.. మహిళా కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన – ysrcp corporator and his followers creates ruckus in seb police station at anantapur
అక్కడ ఎస్సై సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ అడ్డుకుని వారించారు.. ఇది పబ్లిక్ ప్రాపర్టీ తాము ఎక్కడైనా కూర్చుంటామంటూ కార్పొరేటర్ చంద్రతోపాటు అతని అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఎస్ఐ మునిస్వామి అక్కడికి చేరుకోగా ఆయనతో కూడా దురుసుగా ప్రవర్తించారు. ఎస్సై మునిస్వామి, కానిస్టేబుల్ శేఖర్, మహిళా కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. తాము ఎమ్మెల్యే అనుచరులమని ఎదిరిస్తారా అంటూ పోలీసులపై దూషణకు దిగారు. అయితే మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై సెబ్ ఏఎస్పీ స్పందించారు. స్టేషన్‌కు వచ్చినవారు నిందితుడు సురేష్ బంధువులన్నారు. మద్యం అమ్ముతున్న సురేష్‌ను సెబ్ స్టేషన్‌కు తీసుకొచ్చారని.. అతని బంధువులకు సమాచారమివ్వడంతో వారు స్టేషన్ వద్దకు వచ్చారన్నారు. సీఐ లేరని చెప్పడంతో పోలీసులతో వాదనకు దిగారని.. విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. నిందితుడి తండ్రి, మరో పది మంది స్టేషన్‌కు వచ్చారని తెలిసిందన్నార. ఒక కార్పొరేటర్ ఉన్నారని.. ఆ విషయం గురించి లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ చేస్తున్నారన్నారు.
మరోవైపు ఈ ఘటనలో అనంతపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెబ్ మహిళా కానిస్టేబుల్ రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 145/23 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ యూ/ఎస్ 323, 186, 506, 509 రెడ్ విత్ 34 సెక్షన్‌ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే సెబ్ స్టేషన్‌కు వెళ్లిన వారిలో వాలంటీర్లు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ లో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోంది. అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని విడిచిపెట్టాలంటూ… వైసీపీ ఎమ్మెల్యే రౌడీ అనుచరులు అనంతపురంలోని గుల్జార్ పేట సెబ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేయడాన్ని… పోలీసులను చితకబాదడాన్ని… మహిళా పోలీస్ డ్రెస్ లాగుతూ పీఎన్ నుంచి బయటకు ఈడ్చుకెళ్లడాన్ని పాలకులు కానీ, పాలకులకు కొమ్ము కాస్తున్న పోలీసు పెద్దలు కానీ ఎలా సమర్ధించుకుంటారు? ముఖ్యంగా ఈ దాడిలో వైసీపీ రౌడీలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం ఇంకా దారుణం. ఒక నేరగాడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు ఇలాంటి నేరస్తుల పహారాలో భయం భయంగా బతకాల్సి వస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News