News
Amit Shah Hyderabad Tour,అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో ట్విస్ట్..! – central minister amit shah hyderabad tour for 2 days during telangana liberation day
బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న విమోచన దినోత్సవాలకు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం 16వ తారీఖునే అమిత్ షా.. హైదరాబాద్ చేరుకోనున్నారు. అదే రోజు రాత్రి తెలంగాణ బీజేపీ నాయకులతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యాచరణపై తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
అమిత్ షా షెడ్యూల్ ఇలా సాగనుంది..
16వ తారీఖున రాత్రి 7.55 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుని రాత్రికి బస చేస్తారు. అయితే.. ఇక్కడే బీజేపీ నేతలతో భేటీ అవుతారా.. ఇంకేదైనా షెడ్యూల్‌లో మార్పు ఉందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు.. 17వ తేదీన ఉదయం 8.35 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు అమిత్ షా చేరుకుంటారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన ఉత్సవాల్లో పాల్గొంటారు. 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు. 11.50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.