News

Amicus Curiae Vijay Hansaria,దోషిగా తేలిన నేతలకు ఆరేళ్ల నిషేధం సరిపోదు.. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ వెల్లడి – amicus curiae vijay hansaria tells sc six year ban for convicted politicians inadequate


క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్దారణ అయిన ప్రభుత్వ ఉద్యోగులను శాశ్వతంగా సర్వీసుల నుంచి తొలగిస్తారని, అదే రాజకీయ నాయకుల విషయంలో ఆరేళ్ల పాటు నిషేధంతో సరిపెట్టడం సరికదాని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తెలియజేశారు. దోషులుగా తేలిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పోటీకి అర్హత ఉందా? అంశంపై విచారణకు సుప్రీంకోర్టు ఇటీవల అంగీకరించింది. ఈ నేపథ్యంలో అమికస్ క్యూరీ ఈ పోలికను తీసుకొచ్చారు. తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై నమోదయిన క్రిమినల్ కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టుకు సహకరిస్తోన్న సీనియర్ హన్సారియా.. దోషులుగా తేలిన ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతల మధ్య అసమానతలను ఎత్తిచూపారు.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సర్వీసు నిబంధనల ప్రకారం నైతికతకు సంబంధించి ఏదైనా నేరానికి పాల్పడి దోషిగా తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు… నైతికత విషయంలో క్లాస్ IV ఉద్యోగి కూడా శిక్ష విధిస్తారు.. ఆల్-ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1951, రూల్స్ ప్రకారం ఏదైనా హోదాలో ఉన్న క్లాస్ I, II, III ఉద్యోగులు నైతికత నియమావళిని అతిక్రమించకూడదు’ అని చెప్పారు.

‘సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, జాతీయ మానవహక్కుల కమిషన్ సహా చట్టబద్ధమైన ఇతర సంస్థలు కూడా నైతికతను అతిక్రమించిన వ్యక్తులను సభ్యులు లేదా ఛైర్మన్‌లుగా నియమించకుండా నిరోధించిన చట్టం.. దోషులుగా నిర్ధారణ అయిన రాజకీయ నాయకులకు మినహాయింపు ఇచ్చింది’ అని వాదించారు. దోషులు పార్లమెంటు, అసెంబ్లీలలో సభ్యులుగా మారడం స్పష్టంగా ఏకపక్షమని ఆయన విబేధించారు.

క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై విచారణను వేగవంతం చేయడానికి ఆటంకంగా ఉన్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 (3) రాజ్యాంగ చెల్లుబాటుపై పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల హన్సారియాకు తెలిపింది. ఈ నిబంధనపై పూర్తి వివరణ సమర్పించాలని అమికస్‌ క్యూరీని ధర్మాసనం కోరింది. అయితే, 2020 డిసెంబరులో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల మధ్య పోలికను తిరస్కరిస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) చట్టబద్ధతను సుప్రీంకోర్టు పరిశీలించకుండా కేంద్రం నిరోధించిడం గమనార్హం.

సెక్షన్ 8(3) ప్రకారం ప్రజాప్రతినిధులు ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలి, రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలు శిక్షను ఖరారైతే.. ఎన్నికలలో పోటీ చేయడానికి ఆరేళ్లపాటు అనర్హులు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చట్టబద్దతను పరీక్షించకుండా ‘ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాసేవకులే అయినప్పటికీ ఎన్నికైన ప్రతినిధులకు సంబంధించి నిర్దిష్ట ‘సేవా నిబంధనలు’ నిర్దేశించలేదు.. సాధారణంగా దేశ పౌరులకు సేవ చేస్తామని వారు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటారు’ అని కేంద్రం పేర్కొంది.

‘వారు ఇప్పటికే ప్రజాప్రాతినిధ్య చట్టం పరంగా అనర్హతతో పాటు కాలానుగుణంగా సుప్రీంకోర్టు నిర్దేశించిన వివిధ ఆదేశాలు, ఉత్తర్వులకు కట్టుబడి ఉన్నారు’ పేర్కొంది. ప్రజాప్రతినిధుల్లా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రిక్రూట్‌మెంట్ నిబంధనలతో సహా సంబంధిత సర్వీసు రూల్స్ ఉంటాయి.. అందువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటుకు సవాల్‌ను సమర్థించలేం’ అని స్పష్టం చేసింది.

Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button