ambati rambabu, జనసేన అమ్ముడుపోయే పార్టీ.. పవన్ కళ్యాణ్ వేలంపాట పెట్టేశారు: అంబటి రాంబాబు – minister ambati rambabu hot comments against janasena party chief pawan kalyan
కాపులను సర్వ నాశనం చేయడానికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మేయడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన అని వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీలను నమ్మితే కొంప మునుగుతుందని హెచ్చరించారు.
ఇక, విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తే ముఖేష్ అంబానీ, జిందాల్ వచ్చారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఏపీలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారని జోస్యం చెప్పారు. ప్రధాన మంత్రితో కూర్చునే వాళ్లు వచ్చి సీఎం జగన్‌ను ఆశీర్వదించి వెళ్లారన్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని.. యువతకు ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయని అంబటి రాంబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.