ambani driver salary, Mukesh Ambanis Driver: ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వారందరి కంటే ఎక్కువ.. ఐటీ ఉద్యోగులకు మించి..! – salary of mukesh ambanis driver, he earns higher than most people you know
ప్రముఖులు, దిగ్గజాల దగ్గర పనిచేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో సహా అన్ని నైపుణ్యాలను ఆ కంపెనీలు ట్రైనింగ్ ఇస్తుంటాయి. ఇక లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా వాడాలి? అని కూడా శిక్షణ ఇస్తుంటాయి. ఎలాంటి రోడ్లపై అయినా, అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఆ వాహనాన్ని నడిపేలా వీరు తర్ఫీదు పొందుతారు. ఆ డ్రైవర్లతో సహా వంట మనుషులు, గార్డులు, వివిధ సిబ్బందికి ప్రోత్సాహకాలతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంట.
ఇక ప్రముఖులకు డ్రైవర్లు, వంట మనుషులు, ఇతర సిబ్బంది ఎలా ఉంటారు? వారి జీవితం ఎలా ఉంటుందనేది మనం చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం. సినిమా సెలబ్రిటీల మేనేజర్స్, బాడీ గార్డ్స్, ఆయాల జీతాలు కూడా బయటకు వచ్చాయి. బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ వంటి స్టార్ హీరోలు వారి వారి బాడీగార్డ్స్‌కు కోట్లల్లో జీతం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ దంపతులు.. తమ పిల్లల్ని చూసుకునే ఆయాకు నెలకు లక్షన్నర రూపాయలు ఇస్తున్నారట. ఇక ఓవర్‌టైమ్ సమయంలో ఇది రూ.1.75 లక్షల వరకు ఉంటుందంట. కొద్దిరోజుల కింద షారుక్ ఖాన్ మేనేజర్ విలాసవంతమైన ఒక ఇంటిని కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఆమె ఏడాదికి రూ.7-9 కోట్ల వరకు జీతం తీసుకుంటారని తెలిసింది. ఇక ఆమె ఆస్తుల విలువ రూ.50 కోట్లకుపైమాటే.
- Read Latest Business News and Telugu News