Amazon: షాపింగ్ లవర్స్‌కు బంపరాఫర్.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఆఫర్లపై ఓ లుక్కేయండి.. | E commerce site Amazon offering best discount In amazon great freedom festival 2022 Telugu Business News
Amazon Great Freedom Festival Sale 2022: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ వినయోగదారులను ఆకర్షిస్తోంది. మొన్నటి మొన్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరుతో…

Amazon Great Freedom Festiv
Amazon Great Freedom Festival Sale 2022: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ వినయోగదారులను ఆకర్షిస్తోంది. మొన్నటి మొన్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించిన ఈ సంస్థ తాజాగా మరో సేల్‌ను తీసుకొస్తోంది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2022 ఆగస్టు 6 నుంచి ప్రారంభంకానుంది. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమయ్యే ఈ సేల్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెజాన్ ప్రతీ ఏటా ఆగస్టులో ఈ సేల్‌ను నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే అమెజాన్ తీసుకొస్తున్న ఈ సేల్‌లో ఐఫోన్ 13 సిరీస్‌పై భారీగా డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్‌లో మొదటిసారి కొనుగోలు చేస్తున్న వారికి అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ ఆఫర్లు ల్యాప్‌టాప్, స్మార్ట్ స్పీకర్స్, గృహోపకరణాలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై లభించనుంది.
ఆఫర్లపై అమెజాన్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏకంగా 40 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అమెజాన్ ఎకో డివైజ్‌లపై కూడా 45 శాతం డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ ఫైర్ టీవీపై 44 శాతం, ల్యాప్‌టాప్‌లపై రూ. 40,000 తగ్గింపు ధర అందించనున్నట్లు సమాచారం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..