News

Amala Akkineni: వీధి కుక్కలు దాడి పై స్పందించిన అమల.. కుక్కలను శత్రువులుగా చూడొద్దు అంటూ.. | Akkineni Amala reacts to the dog attack on the boy in Amberpet


దాంతో జీహెచ్ఎమ్ సీ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మిని టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ఘటన పై సీరియస్ అయ్యారు.

హైదరాబాద్ లోని అంబర్ పెట్ లో వీధి కుక్కలు ఒక బాలుడు పై దాడి చేసిన విషయం తెలిసిందే. కుక్కలా దాడిలో ఆ బాలుడు చనిపోయాడు. దాంతో జీహెచ్ఎమ్ సీ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మిని టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ఘటన పై సీరియస్ అయ్యారు. ఆయన ట్విట్టర్ వేదికగా మేయర్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే కొంతమంది జంతుప్రేమికులు ఈ ఘటనలో వీది కుక్కలను తప్పుబట్టడం పై నోరు విప్పుతున్నారు. యాంకర్ రష్మి స్పందిస్తూ మూగ జీవాలను శిక్షించడం తప్పని,వాటికి షల్టర్ కల్పించాలని పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె పై  కూడా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అక్కినేని అమల ఈ సంఘటన పై స్పందించారు. అమల బ్లూ క్రాస్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఒక కార్యక్రమానికి హాజరైన అమల ఈ ఘటన పై స్పందించారని తెలుస్తోంది.

ఆమె మాట్లాడుతూ.. బాలుడు మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలను శత్రువులుగా చూడొద్దని ఆమె అన్నారు. ఒక మనిషి తప్పు చేస్తే అందరిని శిక్షిస్తామా.? అలాగే ఒక కుక్క చేసిన తప్పుకు అన్ని కుక్కలను శిక్షించడం కరెక్ట్ కాదని అన్నారు. ఇక కుక్కలు ఎప్పుడు మనుషుల పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి. మనల్ని ప్రేమిస్తూ ఎప్పుడు మనకి రక్షణగా ఉంటాయి. అని అమల చేసినట్టు తెలుస్తోంది. అయితే అమల ఈ విషయం పై స్పందించిందని నటి సురేఖ వాణి కూతురు సుప్రీత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button