Entertainment

Allu Arjun: అల్లు అర్జున్ సీక్రెట్స్ గురించి శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే


ఆర్య సినిమాతో లవర్ బాయ్ గా మారిపోయాడు. దేశ ముదురు, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాలతో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయినా బన్నీ ఆ తర్వాత వరుస సినిమాలతో హీరోగా ఎదిగాడు. ఆర్య సినిమాతో లవర్ బాయ్ గా మారిపోయాడు. దేశ ముదురు, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాలతో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హిట్ కొట్టి ఇండియా వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సినిమాలతోనే కాదు షూటింగ్ గ్యాప్స్ లో ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటాడు బన్నీ. తన గారాల కూతురు అర్హతో కలిసి అల్లరి చేసే వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ గురించి ఓ ఆసక్తికర విషయాన్నీ పంచుకున్నాడు ఆయన తమ్ముడు శిరీష్.

తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంట్రవ్యూకి హాజరైన అల్లు శిరీష్ తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు. పుష్ప సినిమా రిలీజ్ అయిన టైం లో తాను ముంబైలో ఉన్నానని నేను బన్నీ తమ్ముడినని అక్కడ ఎక్కువ మందికి తెలియక పోవడంతో పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినని అన్నారు.

అలాగే అల్లు అర్జున్ తన సీక్రెట్స్ నీకు చెప్తాడు కదా అని అలీ అడగ్గా.. అవును నాకు బన్నీ తన సీక్రెట్స్ చెప్తాడని అన్నాడు. ఆ విషయాలు మా వదిన (అల్లు స్నేహ రెడ్డి )తలకు గన్ పెట్టి అడిగినా చెప్పానని శిరీష్ చెప్పుకొచ్చాడు. ఇక శిరీష్ నటించిన ఉర్వశివో రాక్షసివో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button