News

Allu Arjun: తనతో ఆడిపాడిన హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ట్విట్టర్ వేదికగా ఆ బ్యూటీ హర్ట్ | Varudu movie heroine bhanu sri mehra alleges that his co actor allu arjun blocked her in twitter Telugu Film News


అసలు ఏమైందిరా బై.. బన్నీ ఎందుకు బ్లాక్ చేసిండు.. మళ్లీ ఎందుకు అన్ బ్లాక్ చేసిండు అనేది అర్థం కాక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.

పుష్ప సినిమాతో.. పాన్ ఇండియా లెవల్‌లో పాగా వేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ స్టైల్‌కు, స్వాగ్‌కు జనాలంతా ఫిదా అయ్యారు. ప్రజంట్ పుష్ప సీక్వెల్ షూట్‌లో బిజీగా ఉన్నాడు బన్నీ. అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఎంతమంది హీరోయిన్స్‌తో పనిచేశాడు. వారిలో కొందరు స్టార్ స్టేటస్ అందుకుంటే.. మరికొందరు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి.. పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. కొంతమంది గురించి అయితే అసలు సమాచారం కూడా లేదు. వారు ఏం చేస్తున్నారో కూడా తెలీదు. అలా కనుమరుగు అయినవాళ్లలో.. హీరోయిన్​ భానుశ్రీ మెహ్రా ఒకరు. అల్లు అర్జున్​‌తో వరుడు సినిమాలో ఆడిపాడిన ఈ భామ .. ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అంతా ఆడకపోవడం వల్ల.. ఆ తర్వాత ఆమెకు పెద్దగా చాన్సులు రాలేదు.  కామియో, గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రల్లో కనిపించినా.. అవి పెద్దగా హెల్ప్ అవ్వలేదు.

అయితే తన అభిమానించేవారి​ కోసం సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా బన్నీ గురించి ఊహించని కామెంట్స్ చేసింది. బన్నీ తనను ట్విట్టర్​లో బ్లాక్​ చేశాడంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించి స్క్రీన్​షాట్​ను కూడా ఆ పోస్ట్​కు యాడ్ చేసింది. దీంతో అల్లు ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ‘వరుడు’ తర్వాత ఇప్పటికీ తనకు మంచి అవకాశాలు రావడం లేదని తెలిపిన భానుశ్రీ.. ఎంతటి కష్టసమయంలోనైనా హాస్యాన్ని వెతుక్కోవడం తాను నేర్చుకున్నట్లు రాసుకొచ్చింది. ఆ తర్వాత కాసేపటికీ గ్రేట్ న్యూస్, తనను అన్​బ్లాక్​ చేశాడంటూ మరో పోస్ట్​ పెట్టింది ఆమె. దీంతో ఫ్యాన్స్​ గందరగోళంలో పడిపోయారు. అసలేం జరిగిందో అర్థం కావట్లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button