Entertainment

Bhola Shankar: మెగాస్టార్ సినిమాలో అక్కినేని యంగ్ హీరో.. భోళా శంకర్ సినిమాలో కీ రోల్‌ కోసం..


ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా రానుంది

మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా రానుంది. ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేశాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో అక్కినేని హీరో కూడా నటిస్తున్నాడు. అక్కినేని సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. తాజాగా సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతని విషెస్ చెప్పింది భోళా శంకర్ టీమ్.

ఇక ఈ సినిమాను చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నారు మెహర్ రమేష్. ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. త్వరలోనే భోళాశంకర్ నుంచి కీలక అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

The #BholaaShankar family wishes the charming @iamSushanthA a very Happy Birthday❤️

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button