Entertainment

Custody OTT: ‘కస్టడీ’ డిజిటల్ రిలీజ్ ఆ ఓటీటీలోనే.! స్ట్రీమింగ్ అప్పటి నుంచే..


అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట ఆట నుంచి యావరేజ్ తెచ్చుకుని.. స్లో అండ్ స్టడీగా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై కీలక అప్‌డేట్ వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘కస్టడీ’ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ తొలి వారం లేదా రెండో వారంలో ‘కస్టడీ’ ఓటీటీలోకి వస్తుందని టాక్. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రీసెంట్ మూవీస్ అయిన ‘దసరా’, ‘శాకుంతలం’, ‘రావణాసుర’, ‘ఏజెంట్’ మాదిరిగా నెల కంటే ముందే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందట

కాగా, ఈ మూవీలో తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించగా.. వెన్నెల కిషోర్, సంపత్ రాజు, శరత్ కుమార్, ప్రియమణి, ప్రేమ్‌జీ అమరన్ కీలక పాత్రలు కనిపించారు. కెరీర్‌లో మొదటిసారి పోలీస్ గెటప్‌లో కనిపించాడు నాగచైతన్య. అలాగే ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button