Entertainment

Samantha: మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత.. స్పందించిన అఖిల్ అక్కినేని..


Akhil Akkineni, Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు శనివారం తన ఇన్ స్టా వేదికగా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రకటనతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు షాకయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు అభిమానులు, సెలబ్రెటీలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రియా, రాశిఖన్నా, సుస్మిత కొణిదెల స్పందిస్తూ.. త్వరగా కోలుకో.. ఎప్పటిలాగే ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత అనారోగ్యంపై అక్కినేని అఖిల్ స్పందించారు. అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత.. ఉన్నట్టుండి సైలెంట్ కావడంతో పలు వార్తలు తెరమీదకు వచ్చాయి. కొద్ది రోజులుగా సామ్ అరుదైన చర్మ సమస్యతో బాధపడుతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. సామ్ అనారోగ్యం గురించి వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు ఆమె మేనేజర్. దీంతో ఆమె ముఖానికి సర్జరీ చేయించుకుందని.. అందుకే బయటకు రావడం లేదంటూ టాక్ నడిచింది. ఇటీవల ఆమె నటించిన ఓ యాడ్ షూట్ ఫోటోస్ బయటకు వచ్చాయి. అందులో సామ్ ముఖం కాస్త వేరుగా కనిపించింది. దీంతో ఆమె సర్జరీ చేయించుకుందని… అందుకే ఫోటోస్ షేర్ చేయడం లేదంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా సామ్ అనారోగ్యం గురించి రకరకాల రూమర్స్ హల్చల్ చేశాయి.

ఈ క్రమంలోనే తాను మైసోటిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు ప్రకటించి తన అనారోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది సామ్. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. అలాగే.. ఆమె నటించిన యశోద చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

Samantha

Samantha

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Related Articles

Back to top button