Varisu vs Thunivu: బాక్సాఫీస్ వద్ద అజిత్, విజయ్ సినిమాల హవా.. మొదటి రోజు ఏ మూవీకి ఎక్కువ వసూళ్లు వచ్చాయంటే?
తమిళనాట ఇప్పటికే సంక్రాంతి పందెం రంజుగా సాగుతోంది. అజిత్ కుమార్ తునివు (తెలుగులో తెగింపు, విజయ్ వారీసు( తెలుగులో వారసుడు) బుధవారం (జనవరి 11) నే గ్రాండ్గా రిలీజయ్యాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పోరు నువ్వా? నేనా? అన్నట్లు సాగుతోంది. స్టార్ హీరోల సినిమాలు క్లాష్ అవుతుండడంతో ఎవరు పొంగల్ విజేతగా నిలుస్తారనే ఉత్కంఠ అటు టాలీవుడ్లోనూ, కోలీవుడ్లోనూ నెలకొంది. తెలుగులో బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి ఇవాళ గ్రాండ్గా థియేటర్లలోకి అడుగుపెట్టాడు. అప్పుడే కలెక్షన్ల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య శుక్రవారం (జనవరి 13) బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాడు. ఇక తమిళనాట ఇప్పటికే సంక్రాంతి పందెం రంజుగా సాగుతోంది. అజిత్ కుమార్ తునివు (తెలుగులో తెగింపు, విజయ్ వారీసు( తెలుగులో వారసుడు) బుధవారం (జనవరి 11) నే గ్రాండ్గా రిలీజయ్యాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఈనేపథ్యంలో రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అజిత్ వర్సెస్ విజయ్ పోటీలో ఎవరు విజయం సాధించారన్నాది ఆసక్తిగా మారింది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ప్రకారం..తమిళనాడులో అజిత్ తునివు మొదటిరోజు పాతిక కోట్ల మేర కలెక్షన్స్ సాధించగలిగింది. అదే సమయంలో విజయ్ వారీసు దాదాపుగా రూ.20 కోట్లదాకా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
అయితే తమిళనాడు కాకుండా ఇతర ప్రాంతాలు, విదేశీ వసూళ్లు కలుపుకుంటే వసూళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక తునివు తెలుగులో విడుదల కాగా.. వారీసు తెలుగు వెర్షన్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. మొత్తానికైతే రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి విజేతగా నిలిచేందుకు తెగ పోటీపడుతున్నాయి. కాగా వారసుడు సినిమాలో విజయ్, రష్మిక మంధాన జంటగా నటించగా, తెగింపు సినిమాలో అజిత్, మంజు వారియర్ కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది సంక్రాంతి విజేతగా నిలిచిందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Pongal 2023 TN Box Office Day 1#Thunivu – ₹ 24.59 cr#Varisu – ₹ 19.43 cr
— Manobala Vijayabalan (@ManobalaV) January 12, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి