News

ajeya kallam, వివేకా హత్య కేసులో సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చాను.. ఆ వివరాలు బయటికెలా వచ్చాయి: అజేయ కల్లాం – ap govt advisor ajeya kallam press meet over cbi enquiry on ys vivekananda reddy case


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన స్టేట్‌మెంట్ సీబీఐ నమోదు చేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరు అయిన అజేయకల్లాం ప్రకటించారు. కొన్ని మీడియాల్లో ఆయన స్టేట్ మెంట్ సీబీఐ నమోదు చేసిందని .. గుండెపోటుతో మరణించారని చెప్పారని.. సమయం మాత్రం గుర్తు లేదన్నారని ప్రచారం జరిగింది. దీంతో వివరణ ఇచ్చేందుకు ఆయన మీడియా సమావేశం పెట్టారు. సీబీఐకి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎందుకు లీకయిందని ఆయన ప్రశ్నించారు. ఇదంతా రహస్య సమాచారం అని.. సీబీఐ దగ్గర నుంచి ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. వీటిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. మీడియాలో తాను వివేకానందరెడ్డి గండెపోటుతో చనిపోయారని జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోందని.. తన నోటి వెంట అసలు గుండెపోటు అనే మాటే రాలేదని ఆయన స్ఫష్టం చేశారు. తనపై వచ్చిన వార్తలపై అవసరం అయితే కోర్టుకు వెళ్తానని అజేయ కల్లాం హెచ్చరించారు.వివేకా మరణించిన విషయాన్ని జగనే తమకు చెప్పారని.. అయితే గుండెపోటుతో చనిపోయారనే విషయాన్ని చెప్పలేదన్నారు. గుండెపోటా.. మరో కారణమా అనే విషయం సీబీఐ తనను అడగలేదని అజేయకల్లాం స తెలిపారు. ఆ రోజు సమావేశంలో నలుగురు ఉన్నామని.. వారిలో తానొకడినన్నారు. ఏ సమయంలో జగన్ చెప్పాలో తనకు గుర్తు లేదని స్పష్టం చేశారు. తాను సీబీైఐకి ఇచ్చిన స్టేట్ మెంట్‌లో చెప్పకూడని అంశాలు ఎలా బయటకు వచ్చాయని.. ఆధారాలు లేకుండా మీడిాయ ఎలా రాస్తుందని ప్రశ్నించారు. కాన్ఫిడెన్షియల్ సమాచారం అంటే సీబీఐ నుంచే రావాలిగా అని ఆయన ప్రశ్నించారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్‌లో గుండెపోటుతో చనపోయారనే పదమే వాడలేదన్నారు.

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున తెల్లవారుజామున సీఎం జగన్‌తో నలుగురు కీలక నేతలు మీటింగ్‌లో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వివేకా చనిపోయిన విషయం గురించి చెప్పారన్న ప్రచారం జరిగింది. గండెపోటుతో చనిపోయారని చెప్పారని ఓ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆ మీడియా రిపోర్ట్స్ ఆధారంగా అందులో చెప్పిన నలుగుర్ని పిలిచి ప్రశ్నిస్తారని అనుకోలేదు. కానీ అనూహ్యంా అజేయకల్లాం స్టేట్ మెంట్ రికార్డు చేయడం .. అది కూడా మీడియాలో వచ్చిన తర్వాత నిజమని చెప్పడం సంచలనంగా మారిందని అనుకోవచ్చు.

అజేయకల్లాం ఐఏఎస్ ఆఫీసర్. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వల్ప కాలం సీఎస్‌గా పని చేశారు. పదవీ కాలం పొడిగింపు లభించకపోవడంతో అసంతృప్తికి గురై వైఎస్ఆర్‌సీపీ పెద్దలకు దగ్గరయ్యారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సమావేశాలు పెట్టి విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం సలహాదారుగా నియమితులయ్యారు.

Related Articles

Back to top button