చిన్న తనం నుంచి ఐశ్వర్య చాలా కష్టాలు ఎదుర్కొంది. ఆమె తండ్రి రాజేష్ కూడా నటుడే.. చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలతో అయన మరణించడంతో కుటుంబ భారమంతా ఐశ్వర్య రాజేష్ పై పడింది.
Jan 10, 2023 | 12:47 PM
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ తన సొంత టాలెంట్ తోనే పైకొచ్చింది. నటి గా తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు.
చిన్న తనం నుంచి ఐశ్వర్య చాలా కష్టాలు ఎదుర్కొంది. ఆమె తండ్రి రాజేష్ కూడా నటుడే.. చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలతో అయన మరణించడంతో కుటుంబ భారమంతా ఐశ్వర్య రాజేష్ పై పడింది.
తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పేరుతెచ్చుకుంది. తరువాత తెలుగులోనూ హీరోయిన్ గా నటించింది. కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.
ఆ తరువాత వరల్డ్ ఫేమస్, టక్ జగదీష్ సినిమాలతో అలరించింది ఈ భామ. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.
మొన్నామధ్య ఐశ్వర్య మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా.. నా ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయా ని ఎమోషనల్ అయ్యింది.
Advertisement
ఊహ తెలిసిన వెంటనే తండ్రిని కోల్పోయా.. ఆ తర్వాత అన్నయ్యలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు అని చెప్పుకొచ్చింది. జీవితం తనకు చాలా పాఠాలు నేర్పిందని.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత.. రాక ముందుకూడా తన చాలా ఎదురుదెబ్బలు తగిలాయని అంది ఐశ్వర్య రాజేష్.
స్టార్ హీరోయిన్ అవ్వకపోయినా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడ్డానని, తన సినిమాలు ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలని అనుకున్నానని చెప్పుకోచ్చింది ఈ బ్యూటీ.