News

Aha: సరికొత్త కథను తీసుకువస్తున్న ఆహా.. ఆనంద్ దేవరకొండ సినిమా పోస్టర్.. | Aha ott released highway movie poster starrer anand deverakonda and manasa telugu Cinema News


ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన మానస కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా.

ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్.. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లను తీసుకువస్తూ సినీ ప్రియులకు ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా (Aha). గేమ్ షోస్.. టాక్ షోస్ తీసుకువస్తున్న ఆహా.. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ షోతో సంగీత ప్రియులను అలరించింది. ప్రస్తుతం చెఫ్ మంత్ర, సర్కార్ 2 వంటి ఇంట్రెస్టింగ్ షోలతో వినోదాన్ని అందిస్తున్న ఆహా.. ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం హైవే (HighWay). ఈ చిత్రానికి కేవి గగన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన మానస కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా. ఇందులో ఆనంద్ ఫోటోగ్రాఫర్ విష్ణు పాత్రలో కనిపించనుండగా.. మానస (తులసి) అనే యువతిగా కనిపించనుంది. వీరిద్దరి ప్రేమ కథలో సీరియల్ కిల్లడి ఢి అనే పేరుతో ప్రవేశిస్తాడు. విష్ణు తన ప్రేమను తులసి కాపాడుకోగల్గుతాడా ? ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకొలాజికాల్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది.

ఇవి కూడా చదవండి

Advertisement



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button