adivi sesh, HIT 2: నా జర్నీని తలుచుకుంటే ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంది: అడివి శేష్ – hero adivi sesh excited about his cinema journey in hit 2 teaser event
HIT 2 Teaser: నాని (Nani) నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమాపై వైవిధ్యమైన చిత్రాలను అందిస్తున్నారు. ఆ కోవలో రూపొందిన చిత్రం హిట్ 1 (HIT 1). ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దానికి ఫ్రాంచైజీగా రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’ (HIT 2). సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ హీరోగా నటించారు. గురువారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా . తన జర్నీ గురించి తలుచుకుని ఎగ్జయిట్ అవుతున్నానని శేష్ అన్నారు.
కోవిడ్ సమయంలో హిట్ 2 సినిమా చేయటానికి టీమ్ ఎంతో కషపడింది. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సినిమా చాలా బావుంటుంది. ఎంజాయ్ చేస్తారు. టీజర్ చూడగానే విలన్ వాయిస్ బాగా నచ్చింది. హిట్ వెర్సెలో డిఫరెంట్ విజన్స్ ఉన్నాయి. అందుకనే హిట్ 2లో నేను యాక్ట్ చేశాను. హిట్ 1 క్వశ్చన్స్‌తో థ్రిల్ చేస్తే.. హిట్ 2 భయపెట్టి థ్రిల్ చేస్తుంది. శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. హిట్ 2 డిసెంబర్ 2న రానుంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.