News
Aditya L1 Spacecraft,ISRO: ఆదిత్య ఎల్1లో కీలక ఘట్టం.. భూమికి వీడ్కోలు పలికిన స్పేస్‌క్రాఫ్ట్ – isro perfomed the the trans-lagrangian point 1 insertion maneuver of aditya l1 mission
ట్రాన్స్ లాగ్రేంజియన్ పాయింట్ 1లో ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ 110 రోజులపాటు ప్రయాణించి ఎల్1 పాయింట్‌ను చేరుకుంటుంది. ఆ తర్వాత మరో విన్యాసం ద్వారా ఎల్ లాగ్రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలో స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెడతారు.
సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టిన ఇస్రో ఆ తర్వాత నాలుగుసార్లు ఈ స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్యను పెంచింది. తాజాగా మంగళవారం 2 గంటల సమయంలో (సోమవారం అర్ధరాత్రి దాటాక) ట్రాన్స్ లాగ్రేంజియన్ 1 పాయింట్ దిశగా స్పేస్‌క్రాఫ్ట్‌ను మళ్లించింది.
సూర్యుడి బయటి వాతావరణంపై ప్రయోగం కోసం ఇస్రో ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టింది. ఇది సూర్యుడికి చేరువగా వెళ్లదు. భూమి నుంచి ఇది 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వెళ్తుంది. భూమి నుంచి చంద్రుడు ఉన్న దూరానికి ఇది దాదాపు 4 రెట్లు ఎక్కువ. కానీ భూమి, సూర్యుడి మధ్య దూరంలో ఇది ఒక శాతం మాత్రమే కావడం గమనార్హం. ఆదిత్య ఎల్1లో L1 అనేది సూర్యుడికి, భూమికి మధ్య గురుత్వాకర్షణ పరంగా స్థిరమైన ప్రాంతం. ఇది 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించడమే ఇస్రో లక్ష్యం.