Entertainment

Cinema News: ఇండస్ట్రీకి మరో వారసురాలు.. జెండా పాతడం అంత ఈజీ కాదు..


తెలుగు మూవీ ఇండస్ట్రీలోకి చాలా మంది వారసులు వచ్చారు. కొందరే నిలబడగా.. మిగిలిన వారు ఇండస్ట్రీలో నిలబడలేక చేతులెత్తేశారు.

ఒక్కరు సక్సెస్ అయితే చాలు.. వాళ్ళను ఎగ్జాంపుల్‌గా చూపించి అంతా అదే దారిలో నడుస్తుంటారు. సౌత్‌లో వారసురాళ్ళ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇక్కడ  వారసులకు వచ్చినంత ఈజీగా.. స్టార్ డాటర్స్‌కు సక్సెస్ రాదు. కానీ ప్రయత్నం మాత్రం వాళ్ళు ఆపడం లేదు. తాజాగా తన లక్ టెస్ట్ చేసుకోడానికి మరో వారసురాలు కూడా వచ్చేస్తున్నారు. మరి ఆమె ఎవరు..? బ్యాగ్రౌండ్ ఏంటి..?

తెలుగు మూవీ ఇండస్ట్రీలోకి చాలా మంది వారసులు వచ్చారు. కొందరే నిలబడగా.. మిగిలిన వారు ఇండస్ట్రీలో నిలబడలేక చేతులెత్తేశారు. వాస్తవానికి ఇండస్ట్రీకి వారసులు వచ్చినంత ఈజీగా.. వారసురాళ్ళు రావడం కష్టమే. వచ్చినా సక్సెస్ కూడా అంత సులభంగా రాదు. వాళ్ళకు క్రిటిసిజం కూడా ఎక్కువే. ఏ మాత్రం బాగా చేయకపోయినా.. వీళ్ళకు అవసరమా సినిమాలు అంటూ ట్రోలింగ్ మొదలవుతుంది. తెలుగులో చాలా మంది స్టార్ కిడ్స్‌కు ఇది తప్పలేదు. అయితే తమిళంలో మాత్రం కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ సక్సెస్ కావడంతో.. ఈమెను చూసి మరికొందరు స్టార్ డాటర్స్ వస్తున్నారు. తాజాగా శంకర్ కూతురు అదితి (Aditi Shankar) కూడా వచ్చేసారు.

దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన వారసురాలు అదితి.. తాజాగా కార్తి విరుమాన్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా సినిమాలోని ప్రోమో సాంగ్ విడుదలైంది. అందులో అదితిని చూసి.. అభిమానులు ఫిదా అవుతున్నారు. అమ్మాయి చాలా బాగుందంటూ శంకర్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. రెండు హిట్లు పడితే నిలబడటం ఖాయమంటున్నారు. కానీ అదంత ఈజీ కాదు.

అక్షర హాసన్, ఐశ్వర్య అర్జున్ లాంటి వాళ్ళకు బ్యాగ్రౌండ్ ఉన్నా హీరోయిన్‌గా సక్సెస్ రాలేదు. వారసత్వం ఉంది కదా అని అవకాశాలు రావు.. దానికోసం చాలా కష్టపడాల్సిందే. శృతి హాసన్ తర్వాత కొద్దోగొప్పో సౌత్‌లో సక్సెస్ అయిన వారసురాలు ఎవరంటే కళ్యాణి ప్రియదర్శన్ మాత్రమే. హలో సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తమిళం, మలయాళంలో వరస అవకాశాలు వస్తున్నాయి. ఈ జాబితాలో అదితి శంకర్ చేరాలంటే విజయంతో పాటు అదృష్టం కలిసిరావాలి. మరి చూడాలిక.. శంకర్ కూతురు ఏ జాబితాలోకి చేరబోతుందో..?

ఇవి కూడా చదవండి

Advertisement



మరిన్ని సినిమా వార్తలు చదవండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button