Adithi Rao Hydari: సిండ్రెల్లాగా ముస్తాబయిన అదితి .. రొమాంటిక్ టచ్ ఇచ్చిన సిద్ధార్థ్..
మే24న ఈ వేడుకలలో రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. నీలరంగు గౌనులో సిండ్రెల్లా లా ముస్తాబయ్యింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మరోసారి కేన్స్ ఫిల్మ్ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపింది. అయితే ఈ ఫోటోలకు హీరో సిద్ధార్త్ కామెంట్ చేయడం నెట్టింట్ వైరలవుతుంది.
కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో కేన్స్ ఫిల్మ్ ఫేస్టివల్ వేడుకగు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, సారా అలీ ఖాన్, ఊర్వశి రౌతేలా, ఖుష్బూ నుంచి ఇషా గుప్తా, అదితి రావు హైదరీ వరకు అనేక మంది సెలబ్రెటీలు పాల్గొంటున్నారు. మే24న ఈ వేడుకలలో రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. నీలరంగు గౌనులో సిండ్రెల్లా లా ముస్తాబయ్యింది అదితి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మరోసారి కేన్స్ ఫిల్మ్ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపింది. అయితే ఈ ఫోటోలకు హీరో సిద్ధార్త్ కామెంట్ చేయడం నెట్టింట్ వైరలవుతుంది.
అదితి షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. ఓహ్ మై.. అంటూ హర్ట్ అండ్ ఫైర్ ఎమోజీస్ షేర్ చేశారు సిద్ధార్థ్. దీంతో మరోసారి వీరి ప్రేమాయణం గురించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే ఆమె జూబ్లీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా సిద్ధార్థ్ తో ప్రేమాయణంపై ఆమె రియాక్ట్ అయిన తీరు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా సిద్దూతో ప్రేమ గురించి చెప్పాలని మీడియా కోరగా.. ఆమె ముసి ముసిగా నవ్వుతూ సిగ్గుపడిపోయింది. అంతేకాకుండా.. తన చేతులతో సమాధానం దాట వేస్తున్నట్లుగా సంజ్ఞ చేసింది. దీంతో వీరిద్దరి ప్రేమాయణం నిజమేనంటూ ప్రచారం నడిచింది. గతంలో నా హృదయరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధూ అదితికి విష్ చేయడం.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పలుమార్లు రెస్టారెంట్లలో కనిపించడంతో.. వీరిద్దరి ప్రేమలో ఉన్నారనే వార్తలకు వినిపించాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి