Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’ ప్రిమియర్ షో క్యాన్సిల్ ?..
ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మాసివ్ విజువల్ వండర్ వచ్చే నెల (జూన్ 16న) పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అయితే అంతకు ముందే అంటే జూన్ 7 నుంచి జూన్ 18వరకు జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్లో ఈ సినిమా ప్రీమియర్ గా ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం ఆదిపురుష్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మాసివ్ విజువల్ వండర్ వచ్చే నెల (జూన్ 16న) పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అయితే అంతకు ముందే అంటే జూన్ 7 నుంచి జూన్ 18వరకు జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్లో ఈ సినిమా ప్రీమియర్ గా ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. అయితే ఒక షో క్యాన్సిల్ అయినట్లుగా సమాచారం. ట్రిబెకా ఫెస్టివల్లో ఈ సినిమాకు సంబంధించిన మూడు స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు.
తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఇందులో ఒకటి క్యాన్సిల్ అయిందట. జూన్ 13న ప్లాన్ చేసిన ఆదిపురుష్ ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకు అనేది మాత్రం తెలియరాలేదు. జూన్ 15, 17న ప్లాన్ చేసిన రెండు షోస్ మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రామాయణ ఇతిహాసం ఆధారంగా రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా.. సీత పాత్రలో కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. హిందీ, మలయాళం, కన్నడ, మలయాళం భాషలలో జూన్ 16న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయనుంది.