Adani Stocks: 2023లో పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌కు అత్యంత క్లిష్ట సమయం నడుస్తోంది. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ బయటికి వచ్చిన సమయం నుంచి అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే. వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 140 బిలియన్ డాలర్ల వరకు పడిపోయింది. ఇక అదానీ గ్రూప్‌లో 7 స్టాక్స్.. వాటి విలువను మించి షేరు ధర ఉందని, దీనిని కృత్రిమంగానే పెంచారని హిండెన్‌బర్గ్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ ఫ్రాడ్స్ చేస్తోందని, స్టాక్ మానిపులేషన్ చేస్తోందని ఆరోపించింది. ఇక అప్పటినుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ పలు మార్లు లోయర్ సర్క్యూట్ కొడుతూ పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా వరకు అదానీ షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇక నెల రోజుల వ్యవధిలో అదానీ గ్రూప్‌కు చెందిన 3 స్టాక్స్ 85 శాతం వరకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కూడా గతంలో.. అదానీ గ్రూప్ స్టాక్స్ 85 శాతం ఓవర్ వాల్యూడ్‌లో ఉన్నాయని ఆరోపించింది. దీంతో.. ఇప్పుడు అదానీ స్టాక్స్ అక్కడికే చేరాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొన్ని స్టాక్స్ కూడా 70 శాతం వరకు పడిపోయాయి. ఇక ఏ స్టాక్స్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో చూద్దాం.
Adani Loan Repays: వేల కోట్ల అప్పు చెల్లించిన అదానీ.. అయినా కనికరించని ఇన్వెస్టర్లు.. షేర్లలో భారీ పతనం.. బ్లాక్‌డేనే!
Layoffs Ban: అందుకు రూ.8 లక్షల కోట్లు అవసరం.. లేఆఫ్స్ బ్యాన్.. కష్ట సమయంలో గొప్ప మనసుతో..!
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. ఇవి గత నెల వ్యవధిలో 85 శాతం పతనమయ్యాయి. జనవరి 25న హిండెన్‌బర్గ్ రిపోర్ట్ రాగా.. అప్పటినుంచి అదానీ టోటల్ గ్యాస్ రోజూ లోయర్ సర్క్యూట్‌లోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం సెషన్‌లోనూ 5 శాతం పడిపోయి.. ప్రస్తుతం రూ.791.35 వద్ద ఉంది. ఇక అదానీ టోటల్ గ్యాస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.35 లక్షల కోట్లు పడిపోయింది. రూ.4.3 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ విలువ ఇప్పుడు రూ.87 వేల కోట్లకు చేరడం గమనార్హం.
అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు కూడా వరుసగా పడుతూనే ఉంది. గురువారం సెషన్‌లో 5 శాతం నష్టంతో రూ.512.10కి చేరింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ.3048 కాగా.. ఇప్పుడు రూ.500 లెవెల్‌కు చేరడం చూడొచ్చు. ఇక ఈ స్టాక్ మార్కెట్ విలువ కూడా 82 శాతానికిపైగా క్షీణించి ఇప్పుడు రూ.80 వేల కోట్లకు చేరింది. అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ కూడా మార్కెట్ విలువలో 81 శాతం పతనమైంది. దీని షేరు విలువ ప్రస్తుతం 5 శాతం పడిపోయి రూ.749.75 వద్ద ఉంది. మార్కెట్ విలువ కూడా రూ.83 వేల కోట్లకు చేరింది.
Wipro నిర్ణయంపై చెలరేగిన దుమారం.. అన్నీ ఏకమై నిరసన.. ఇప్పుడేం చేస్తుందో?
Zomato Everyday: జొమాటో నుంచి ఇంటి భోజనం.. కొత్త సర్వీసులు షురూ.. రూ.89కే నోరూరించే విందు!
- Read Latest Business News and Telugu News