Entertainment

Trisha Krishnan: రాజకీయాల్లోకి మరో హీరోయిన్.. జయలలిత దారిలోనే ఈ అందాల భామ కూడా..


సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తున్నారు.

సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. అలాగే తమిళనాడులోనూ చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక మహిళలు కూడా రాజకీయాల్లో మగాళ్లు తక్కువేమీ కాదని తమ సత్తా చూపుతున్నారు. ఇప్పటికే తమిళ, తెలుగునాట చాలా మంది మహిళామణులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత, ఎం.జే.ఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు చైన్నై చంద్రం త్రిష కృష్ణన్.

తెలుగు, తమిళ్ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది. గత కొంత కాలంగా ఈ అమ్మడి సినిమాల జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో త్రిష తెలుగు సినిమాలకు బాగా దూరం అయ్యింది. తమిళ్ లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది త్రిష. ఇక ఇప్పుడు ఈ అమ్మడు రాజకీయాల్లోకి వస్తుందన్న వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. త్రిష కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నారని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్ . అలాగే త్రిష రాజకీయ ప్రవేశం వెనక దళపతి విజయ్ ఉన్నారన్న వార్త కూడా కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఆయనే త్రిషను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button