Entertainment

Sonam Kapoor: రూ. 32 కోట్ల ఇంటిని అమ్మేసిన బాలీవుడ్ హీరోయిన్.. ఎందుకంటే..


. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఇంటిని ఢిల్లీకి చెందిన ఓ కంపెనీకి రూ. 32.50 కోట్లకు విక్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ భవనాన్ని 2015లో కొనుగోలు చేసిన సోనమ్.. ఇప్పుడు గతేడాది డిసెంబర్ 29న అమ్మేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనమ్ కపూర్. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ముంబైలోని తన ఖరీదైన ఇంటిని అమ్మేసింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఇంటిని ఢిల్లీకి చెందిన ఓ కంపెనీకి రూ. 32.50 కోట్లకు విక్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ భవనాన్ని 2015లో కొనుగోలు చేసిన సోనమ్.. ఇప్పుడు గతేడాది డిసెంబర్ 29న అమ్మేసింది. ముంబైలో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాల్లో ఉన్న ఫ్లాట్.. ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 5,533 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్‏మెంట్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి రూ. 1.95 కోట్ల స్టాంప్ డ్యూటీ కట్టారు అలాగే ఇటీవల రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

సీనియర్ హీరో అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్.. సవారియా, నీర్జా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ కాకముందు సంజయ్ లీలా భన్సాలీ వద్ద ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2018లో ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకున్నారు సోనమ్..

ప్రస్తుతం వీరిద్దరు లండన్ లో నివసిస్తున్నారు. గతేడాది ఆగస్ట్ లో పండంటి బాబుకు జన్మనిచ్చింది సోనమ్. అతడికి వాయు అని నామకరణం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button