Samantha Ruth Prabhu: అభిమాని చేసిన పనికి ఎమోషనల్ సమంత.. థ్యాంక్యూ మై లవ్ అంటూ..
ఇటీవలే యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది సామ్. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు..
ఇటీవల సమంతకు సంబందించి ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. సామ్ అనారోగ్యానికి గురైన దగ్గర నుంచి ఆమె పై అభిమానులు ఎక్కువ ఫోకస్ పెట్టారు. సామ్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇక ఇటీవలే యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది సామ్. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్ , ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసాయి.
ఇదిలా ఉంటే ఇటీవల సామ్ ఓ షూటింగ్ లో గాయాలపాలైన విషయం తెలిసిందే. షూటింగ్ లో సామ్ చేతికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో చూసిన అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా సమంత ఫ్యాన్ ఆమెకు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. దెబ్బ తగిలిన సామ్ చేతులను అందంగా బొమ్మగా గీసింది.. ఈ పెన్సిల్ ఆర్ట్ ను షేర్ చేస్తూ.. ‘‘నేను మీ సక్సెస్‌కి మాత్రమే ఫ్యాన్‌ని కాదు.. మీ హార్డ్ వర్క్, కమిట్‌మెంట్ , కైండ్ నెస్‌కి హ్యూజ్ ఫ్యాన్‌ని.. ఈ గిఫ్ట్ ను 25 మిలియన్స్ రీచ్ అయినప్పుడు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు ఇస్తున్నా.. ఇది మీకు నచుతుంది అనుకుంటున్నా.. అనిరాసుకొచ్చింది. ఈ పోస్ట్ కు సామ్ రియాక్ట్ అవుతూ థ్యాంక్యూ మై లవ్.. అని రీప్లే ఇచ్చింది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి