Entertainment

Tollywood: ఒళ్లును విల్లులా వంచిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి.. తల్లి అయినా ఫిజిక్ ఏమాత్రం తగ్గలేదుగా..


తాజాగా ఓ హీరోయిన్ వర్కవుట్స్ చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన తన శరీరాన్ని విల్లులా వంచిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.

హీరోయిన్ అంటే గ్లామర్ అతి ముఖ్యం. అందానికి అతి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అలాగే శరీరానికి కూడా. కథానాయికలు తమ ఫిట్‏నెస్ కాపాడుకోవడానికి యోగా, వర్కవుట్స్ చేస్తుంటారు. ఇప్పుడు తమ శరీరాకృతి.. అందం పై హీరోయిన్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. గతంలో పెళ్లై.. పిల్లలు కాగానే ఎంతటి అగ్రకథానాయికలు అయినా..సహయనటిగా మాత్రమే అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. కాజల్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ వంటి స్టార్ హీరోయిన్స్.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కథానాయికలుగానే మెప్పిస్తున్నారు. తమ కుటుంబంతోపాటు.. తమ ఫిజిక్ కాపాడుకుంటూ మరోవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇక తాజాగా ఓ హీరోయిన్ వర్కవుట్స్ చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన తన శరీరాన్ని విల్లులా వంచిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.

ఒల్లును విల్లులా వంచిన ఆ అందాల ముద్దుగుమ్మ మరెవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత. బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్… ఆ తర్వాత అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతేడాది బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 10న పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన తర్వాత ఇప్పుడు మళ్లీ జిమ్ బాట పట్టింది ప్రణీద. అక్కడ వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తోంది. అంతేకాకుండా.. తన గ్లామర్‏ను కూడా మెయింటెన్స్ చేస్తుంది.

అయితే ఇటీవల వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ప్రణీత సుభాష్.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట. తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమాలో ప్రణీత కీలకపాత్రలో కనిపించనుందని టాక్.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button