Entertainment

Payal Ghosh: ఆ డైరెక్టర్ తనపై లైంగిక దాడి చేశాడంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. నెట్టింట ట్వీట్స్‏తో రచ్చ..


బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ వరుస ట్వీట్లతో వార్తలలో నిలిచింది. గతంలో అనురాగ్ తనను వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించింది పాయల్.

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోస్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అయ్యింది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా ఆసక్తికర పోస్ట్స్ చేస్తూ పాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇటీవల తన సూసైడ్ లెటర్ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసి షాకిచ్చింది పాయల్. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకున్నా.. లేదా గుండెపోటుతో చనిపోయినా కారణం ఎవరంటే… అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది పాయల్. దీంతో అలాంటి ఆలోచనలు చేయవద్దంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు ఫ్యాన్స్. తాజాగా తన ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేసింది పాయల్ ఘోస్. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ వరుస ట్వీట్లతో వార్తలలో నిలిచింది. గతంలో అనురాగ్ తనను వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించింది పాయల్.

“నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 నేషనల్ అవార్డ్స్ అందుకున్న డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్లతో కలిసి పనిచేశాను. కానీ ఎవరూ నన్ను ఆ విధంగా టచ్ చేయలేదు. కానీ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో పనిచేయలేదు. అతన్ని మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశాడు. ఇప్పుడు ఎందుకు నేను సౌత్ గురించి గొప్పగా చెప్పుకోకూడదో చెప్పండి. అలాగే జునియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేశాను. కానీ అతను ఎప్పుడూ నాతో అనుచితంగా ప్రవర్తించలేదు. ఆయనొక జెంటిల్మెన్. అందుకే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం”. అంటూ వరుస ట్వీట్స్ చేసింది పాయల్. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి



పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది పాయల్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా నటించిన ఊసరవెల్లి చిత్రంలోనూ కనిపించింది పాయల్. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమా చేసింది. తెలుగుతోపాటు.. కన్నడ, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో తనదైన నటనతో మెప్పించింది పాయల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button