Neha Shetty: ‘రాధికను ఇంప్రెస్ చేయడం మీ వల్ల కాదు’.. ప్రేమ గురించి అందంగా చెప్పిన నేహా శెట్టి..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో నేహా శెట్టి ఒకరు. మెహబుబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో నేహ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో పోషించిన రాధిక పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. టిల్లుకు, రాధిక మధ్య వచ్చే డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇక ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. డీజే టిల్లు తర్వాత బెదురులంక 2012 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నేహాశెట్టి. ఈ సినిమాలోనూ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో రూల్స్ రంజన్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది నేహ. ఈ క్రమంలో తాజాగా రూల్స్ రంజాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నేహా. ఇందులో ప్రేమ గురించి ఎంతో అందంగా చెప్పుకొచ్చింది.
మీరు ప్రేమలో ఉన్నారా ? ఎవరైనా ప్రపోజ్ చేశారా? అని యాంకర్ అడగ్గా.. ఆన్సర్ నువ్వే చెప్పు అంటూ యాంకర్ కు తిరిగి ప్రశ్నించింది. దీంతో ఉండొచ్చు అని అతను చెప్పగా.. నేహా మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. ఇక ప్రేమ గురించి నేహా మాట్లాడుతూ.. ‘లవ్ లో రూల్స్ ఉండవు.. కానీ రూల్స్ పెట్టుకుంటాము. కానీ వాటిని ఫాలో అవ్వము. ప్రేమ ఒక మంచి ఫీలింగ్. ఎంతో హ్యాపినెస్.. రూల్స్.. హద్దులు ప్రేమలో ఉండవు. లవ్ చాలా బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ప్రేమ గురించి గొప్పగా చెప్పిన నేహా ప్రేమలో ఉండే ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అదే ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలని అని అడగ్గా.. నన్ను ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నేహా శెట్టి.. కిరణ్ అబ్బవరం కలిసి నటించిన రూల్స్ రంజాన్ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎం.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు. ఇందులో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది కీలకపాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.