Entertainment

Mirnalini Ravi: బాయ్ ఫ్రెండ్ కావాలంటే ఈ ఒక్క అర్హత ఉంటే చాలంటున్న హీరోయిన్ మృణాళిని రవి..


ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మృణాళిని.. తాజాగా తనకు కాబోయే ప్రేమికుడు ఎలా ఉండాలో చెప్పేసింది. ఇటీవల సేలంలోని అమ్మపేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవంలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ.

మృణాళిని రవి.. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది. విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎనిమి చిత్రంలోని టమ్ టమ్ పాట సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సిగ్నేచర్ స్టెప్పుతో అదరగొట్టిన మృణాళిని ఫాలోయింగ్ పెరిగిపోయింది. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాళిని. ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మృణాళిని.. తాజాగా తనకు కాబోయే ప్రేమికుడు ఎలా ఉండాలో చెప్పేసింది. ఇటీవల సేలంలోని అమ్మపేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవంలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అక్కడ విద్యార్థులకు బహుమతులు అందించిన ఆమె.. అనంతరం ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

తనకు విజయ్ దళపతి.. అజిత్ కుమార్ ఇద్దరూ ఫేవరేట్ హీరోస్ అని.. డాన్స్ లో విజయ్.. వ్యక్తిత్వంలో అజిత్ అంటూ చెప్పుకొచ్చింది. తనకు ఇష్టమైన ఆహారం బిర్యానీ అని తెలిపింది. జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని.. తనను ఎప్పుడూ నవ్వించేలా ఉండి.. ఆనందంగా చూసుకునే ఒకే ఒక్క అర్హత తనకు కాబోయే భాయ్ ఫ్రెండ్ కు ఉండాలని తెలిపింది. అలాగే ప్రస్తుతం తనకు ప్రేమ, పెళ్లిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని.. తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చింది.

అనంతరం.. కాలేజీ అమ్మాయిలతో కలిసి ఎనిమీ చిత్రంలోని టమ్ టమ్ పాటకు డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.. ఎనిమీతోపాటు.. సన్ ఆఫ్ ఎంజీఆర్, కోబ్లా చిత్రాల్లో నటించింది మృణాళిని రవి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button