Entertainment

Kriti Sanon: సంక్రాంతికి సౌత్ లో సాలిడ్ హిట్‌ కొట్టాలని ఆశపడుతున్న బాలీవుడ్ బ్యూటీ..


వరుసగా ఛాన్స్ లు అందుకుంటూ రాణిస్తోంది ఈ పొడుగు కాళ్ళ సుందరి.అయితే ఇప్పుడు సంక్రాంతి గురించి ప్రస్తావన రాగానే అందరి కళ్లూ కృతి సనన్‌ మీదకు వెళ్తున్నాయి

కృతి సనన్‌.. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. ఆ సినిమా తర్వాత నాగచైతన్య నటించిన దోచేయ్ సినిమాలో మెరిసింది. అంతే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా ఛాన్స్ లు అందుకుంటూ రాణిస్తోంది ఈ పొడుగు కాళ్ళ సుందరి.అయితే ఇప్పుడు సంక్రాంతి గురించి ప్రస్తావన రాగానే అందరి కళ్లూ కృతి సనన్‌ మీదకు వెళ్తున్నాయి. రీసెంట్‌ టైమ్స్ లో నార్త్ లో వరుసగా మంచి సినిమాలు చేస్తున్న హీరోయిన్లలో కృతి పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. లాస్ట్ ఇయర్‌ చేసిన మిమి ఈ భామకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది రిలీజైన బచ్చన్‌ పాండే అంతగా ఆకట్టుకోలేకపోయినా, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న బేడియా, గణపత్‌ సినిమాల మీద చాలా ఆశలే పెట్టుకున్నారు కృతి సనన్‌. అయితే వాటన్నిటినీ మించి కృతి అనగానే అందరికీ గుర్తుకొస్తున్న సినిమా ఆదిపురుష్‌.

మర్యాదపురుషోత్తముడి కథతో తెరకెక్కుతున్న ఆదిపురుష్‌లో సీతామహాసాధ్విగా కనిపించారు కృతిసనన్‌. ఇటీవల రిలీజ్‌ అయిన టీజర్‌లోనూ కృతిసనన్‌ లుక్‌కి పాజిటివ్‌ అప్లాజే వచ్చింది. డార్లింగ్‌ ప్రభాస్‌తో ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ గురించి కూడా నార్త్ మీడియాలో చాలా కథనాలే వినిపిస్తున్నాయి.

నార్త్ జనాల దృష్టి ఒకలా ఉంటే, సౌత్‌ ఆడియన్స్ మాత్రం ఇంకోలా ఆలోచిస్తున్నారు. 2014లో సంక్రాంతి రేసులో రిలీజ్‌ అయిన వన్ నేనొక్కడినే సినిమాతో సౌత్‌ లో సందడి చేసింది కృతి. సుకుమార్ డైరెక్షన్ లో మహేష్‌తో కృతి చేసిన ఆ సినిమా జనాలను అట్రాక్ట్ చేయలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు డార్లింగ్‌ సినిమా ఆదిపురుష్‌తో అయినా కృతి మెప్పిస్తారా? సంక్రాంతికి హిట్‌ అందుకుంటారా? ఆవ్‌ తుఝే మోకర్తా అని సౌత్‌ కుర్రకారు చేత అనిపించుకుంటారా? అనేది  చూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button