Entertainment

Jr NTR: ఎన్టీఆర్‌ని ట్రోల్ చేసేంత సీన్ మీకు ఉందా.. ? నెటిజన్లకు కస్తూరి స్ట్రాంగ్ కౌంటర్ 


ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన కస్తూరి ఇప్పుడు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమె నటిస్తోన్న గృహలక్ష్మీ సీరియల్ కు మంచి క్రేజ్ ఉంది.

ఈ మధ్య కాలంలో సినిమా తారలపై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. ఏ చిన్న తప్పు చేసిన వెంటనే ట్రోల్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటారు కొందరు నెటిజన్లు. ఈ క్రమంలోనే కొంతమంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేశారు. అలంటి వారి పై నటి కస్తూరి స్ట్రాంగ్ ఇచ్చారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన కస్తూరి ఇప్పుడు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమె నటిస్తోన్న గృహలక్ష్మీ సీరియల్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ భామ సమాజంలో జరిగే విషయాలపై కాస్త గట్టిగానే స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ఆమె స్పందించింది.

ఈ క్రమంలో మంచు లక్ష్మీ పై వస్తోన్న ట్రోల్స్ ను సమర్ధించింది. తెలుగుని తెలుగులా మాట్లాడాలని అలా మాట్లాడితేనే బాగుంటుందని చెప్పుకొచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడింది. మొన్నామధ్య తారక్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడారు. గోల్డెన్ గ్లోబల్ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా తారక్ అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడటం పై పలువురు ట్రోల్స్ చేశారు.

దీని పై కస్తూరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈవెంట్ లో అమెరికన్ ఇంగ్లీష్ యాసలో మాట్లాడితేనే అక్కడి వారికి అర్థమవుతుందని చెప్పుకొచ్చింది కస్తూరి. అలాగే తారక్ అద్భుతంగా మాట్లాడాడు అని చెప్పుకొచ్చింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button