Kamalini: ఒకప్పుడు అందమే అసూయ పడేలా ఉన్న కమలినీ ముఖర్జీ.. ఇప్పుడెలా ఉందో తెలుసా? అస్సలు ఊహించలేరు.
కమలినీ ముఖర్జీ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్ని సినిమాలే చేసినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ మెప్పించింది కమలినీ. ముఖ్యంగా చీర కట్టులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించే..
కమలినీ ముఖర్జీ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్ని సినిమాలే చేసినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ మెప్పించింది కమలినీ. ముఖ్యంగా చీర కట్టులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించే కమలినీ అప్పట్లో కుర్రకారు మనసులను దోచేసింది. కోల్‌కతాకు చెందిన కమిలినీ 2004లో హిందీ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది. అయితే అదే ఏడాదిలో వచ్చిన ఆనంద్ సినిమాతో తెలుగులో ఒక మెరుపులా దూసుకొచ్చింది.
ఈ సినిమాలో రూపా పాత్రలో నటించిన కమిలినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, జల్సా, గోపి గోపికా గోదావరి వంటి చిత్రాల్లో తనదైన నటన, అందంతో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఆ తర్వాత మాత్రం కమిలినీ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. గోవిందుడు అందరివాడేలే, జగద్గురు ఆది శంకర వంటి చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లో నటించింది. ఇక ఆ తర్వాత కమిలినీ నటించిన మరే చిత్రం విడుదల కాలేదు.
ఇదిలా ఉంటే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కమలినీ ముఖర్జీ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ బెంగాలి ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న కమలినీకి సంబంధించిన ఓ ఫొటో ఆమె అభిమానులను షాక్‌కి గురి చేస్తోంది. డల్లాస్‌లో ఓ ఈ వెంట్‌కు హాజరైన కమలిని చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. సన్న జాజిలా ఉండే కమిలిని లావుగా మారడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన కొందరు ఇదేంటి.. కమిలినీ ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం కమిలినీకి మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..