Entertainment

Jahnvi Kapoor: జాన్వీపై నెటిజన్స్ ఆగ్రహం.. పబ్లిసిటి కోసం ఇంతలా దిగజారుతారా అంటూ దారుణంగా ట్రోలింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..


Jahnvi Kapoor

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో తమ సినిమా ప్రమోషన్ల కోసం రకరకాల దారులను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆడియన్స్‏ను ఆకట్టుకునేందుకు నేరుగా అభిమానులతో ముచ్చటించడం.. లేదా వారిని నేరుగా కలవడం చేస్తుంటారు. అలాగే తమ సోషల్ మీడియాల్లో ఖాతాల్లో ఆసక్తికరంగా పోస్ట్స్ చేస్తూ తమ చిత్రాలను ప్రమోట్ చేస్తుంటారు. ఇటీవల యంగ్ హీరో రాజ్ తరుణ్, నిత్యామీనన్, పార్వతి తిరువోతు కూడా ఇలాంటి డిఫరెంట్ మూవీ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం తన సినిమా ప్రచార కార్యక్రమాలను షురు చేశారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మిలి. ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ వేగం పెంచారు చిత్రయూనిట్.

అయితే తన మూవీ ప్రమోట్ కొత్తగా చేయాలని భావించిన జాన్వీ.. సోమవారం ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ సేల్ చేసింది. అయితే ఉన్నట్లుండి జాన్వీ పాప్ కార్న్ అమ్మడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తన తదుపరి చిత్రం మిలి ప్రమోషన్ అని అర్థం చేసుకున్నారు. అయితే జాన్వీ పాప్ కార్న్ అమ్మడం వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

ఈ వీడియోపై నెటిజన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మీరు పబ్లిసిటి కోసం ఏదైనా చేస్తారు. సినిమా ప్రమోషన్స్ కోసం అవసరమైతే వాష్ రూమ్స్ క్లీన్ చేస్తారు. ఒకవేళ మీరు బోనీ కపూర్ కూతురు కాకపోతే నిజంగానే పాప్ కార్న్ అమ్మేవారు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు జాన్వీ మూవీ ప్రమోషన్స్ కొత్తగా ఉన్నాయంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

Related Articles

Back to top button