Entertainment

Sudheer Babu: ‘కృష్ణగారు ‘హంట్’ చూసి అప్రిషియేట్ చేస్తారనుకున్నాను.. ఇప్పుడు వెలితిగా ఉంది’..హీరో సుధీర్ బాబు కామెంట్స్..


సినిమాలో మెమరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా నటించారు. యాక్షన్ కొత్తగా ట్రై చేశారు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లతో పని చేశారు.

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు. సినిమాలో మెమరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా నటించారు. యాక్షన్ కొత్తగా ట్రై చేశారు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లతో పని చేశారు. ఆ విశేషాలను ఇంటర్వ్యూలతో పంచుకున్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ.. ” నాకు రిస్క్ ఏం కాదు. రోప్స్ ఉంటేనే రిస్క్ ఎక్కువ. లేకపోతే నేనే చేస్తాను కదా! నాకు ఓ ఐడియా ఉంటుంది. ఈ సినిమా యాక్షన్ అంతా రియల్ గా ఉండాలని ‘జాన్ విక్’ సినిమాలను రిఫరెన్స్ తీసుకున్నాం. జాగ్రత్తలు తీసుకుని యాక్షన్ సీక్వెన్సులు చేశా. నేను స్పోర్ట్స్ పర్సన్ కావడం వల్ల ఈజీ అయ్యింది అని చెప్పుకొచ్చారు.

ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అని అడగ్గా.. “ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజులుగా వాళ్ళను ఫాలో అవుతున్నాను. చాలా దేశాల నుంచి వాళ్ళ దగ్గరకు వచ్చి ఫైటింగుల్లో ట్రైనింగ్ తీసుకుంటారు. నేను ఓ యాక్షన్ సినిమా చేస్తే వాళ్ళ దగ్గరకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు సినిమాలకు పని చేస్తారని తెలిసింది. ఎవరెవరు ఏయే సినిమాలకు పని చేశారో తెలియదు. రెండు నెలలు మాట్లాడాం. ముందు ఒక్కటే యాక్షన్ సీక్వెన్సు అనుకున్నారు. మేం నాలుగు అని చెబితే 12 రోజులు పడుతుందని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అప్రోచ్ అవుతారని, చివరకు చేయరని, పేమెంట్స్ ఫస్ట్ ఇవ్వాలని చెప్పారు. మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాత మేం ఫారిన్ వెళ్ళాం. మా కోసం వాళ్ళు డేట్స్ బ్లాక్ చేశారు. నాలుగు రోజుల్లో షూట్ చేశాం అన్ని యాక్షన్ సీక్వెన్సులు. ఇక్కడ ఎవరికైనా చూపించి నాలుగు రోజుల్లో చేశామంటే నమ్మరు. రెండు రోజులు రిహార్సిల్స్ చేశామంతే. స్టంట్స్ పరంగా మేం కొత్తగా ప్రయత్నించాం”. అని అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో ‘హంట్’ చేశానని చెప్పారు. ఎందుకలా?.. అని అడగ్గా.. సుధీర్ బాబు స్పందిస్తూ.. ” ఇది డేరింగ్ అటెంప్ట్. ఇటువంటి కథ ఆయన చేసి ఉండకపోవచ్చు. కానీ, చాలా ప్రయోగాలు చేశారు. కెరీర్ అంతా కొత్తగా ట్రై చేశారు. అందుకని, ఈ సినిమాకు ఆయన రియాక్షన్ తెలుసుకోవాలని అనుకున్నాను. ప్రతిసారీ నా సినిమా విడుదలైనప్పుడు ఆయన ఫోన్ చేయడం లేదంటే ఇంటికి పిలిచి మాట్లాడటం చేసేవారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలైనప్పుడు మాట్లాడాను. అప్పుడు కూడా ‘హంట్’ చూసి ఏం అంటారోనని అనుకున్నాను. ఆయన అప్రిషియేట్ చేస్తారని అనుకున్నాను. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోవడంతో వెలితిగా ఉంది. ఇక నా తదుపరి సినిమాల విషయానికి వస్తే.. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ అని ఓ సినిమా చేస్తున్నాను. ఇది కామెడీ అండ్ యాక్షన్ జానర్ సినిమా. ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అందులో ట్రిపుల్ రోల్ చేస్తున్నాను. యువి క్రియేషన్స్ లో ఇంకో సినిమా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా అది. రెండు మూడు రోజుల్లో టైటిల్ అనౌన్స్ చేస్తారు.” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

Related Articles

Back to top button