Entertainment

Manchu Vishnu: ‘ఆమెను చూసిన ప్రతిసారి ప్రేమలో పడిపోతుంటాను’.. మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్..


మా నాన్న కంటే నేను ఎక్కువగా భయపడే ఒకే ఒక్క వ్యక్తి విరానికా మంచు. నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ భార్యతో కలిసి దిగిన ఫోటోను విష్ణు ట్వీట్ చేశారు.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మంచు విష్ణు. ఇటీవల జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా తమ వివాహ వార్షికోత్సాన్ని పురస్కరించుకుని తన భార్య విరానిక గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు మంచు విష్ణు. మా నాన్న కంటే నేను ఎక్కువగా భయపడే ఒకే ఒక్క వ్యక్తి విరానికా మంచు. నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ భార్యతో కలిసి దిగిన ఫోటోను విష్ణు ట్వీట్ చేశారు.

అలాగే తన సతీమణితో కలిసి ఉన్న ఫోటోలతో కూడిన వీడియోను షేర్ చేస్తూ తన ప్రేమను తెలియజేశారు. “ఆమెను చూసిన ప్రతిసారీ నేను మళ్లీ ప్రేమలో పడుతూనే ఉంటాను. సరదాలు, సంతోషాలు, విహారయాత్రలు, ఇలా చెబుతూ వెళ్తే నా జీవితంలోని ప్రతిక్షణం తాను తోడుగా ఉన్నందుకు ఆనందిస్తున్నా.. లవ్ యూ” ఆయన పేర్కొన్నారు.

విరానికాను మంచు విష్ణు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మేనకోడలు అయిన విరానికా రెడ్డిని ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు మంచు విష్ణు. పెద్దలను ఒప్పించి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. 2011లో కవల ఆడపిల్లలు అరియానా, వివియానా జన్మించగా.. 2018లో కొడుకు అవ్ రామ్ భక్త జన్మించాడు. ఇక 2019లో పాప ఐరా జన్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Advertisement

Related Articles

Back to top button