Entertainment

Atharva Trailer: హీరోయిన్ మర్డర్ మిస్టరీ.. సస్పెన్స్ థ్రిల్లింగ్‏గా ‘అథర్వ’ ట్రైలర్..


ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. భారీ బడ్జె్ట్ చిత్రాలు మాత్రమే కాకుండా కంటెంట్ నచ్చితే చిన్న సినిమాలకు సైతం బ్రహ్మారథం పడుతున్నారు అడియన్స్. ఇంట్రెస్టింగ్, క్యూరియాసిటీ కంటెంట్ తో వచ్చే చిన్న సినిమాలకు అటు ఓటీటీలో.. ఇటు థియేటర్లలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ నేపథ్యంలో వస్తోన్న సినిమా అథర్వ. డైరెక్టర్ మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శుభాష్ నూతలపాటి నిర్మించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఈ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇప్పుడు బుధవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

టాలీవుడ్ హీరోయిన్ జ్యోస్ని హుపారికర్ హత్యతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. సిటీలో హీరోయిన్ తోపాటు మరో మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయి సార్ అంటూ సాగే సంభాషణలతో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. సిటీలో వరుసగా జరిగిన ఈ హత్యలను అథర్వ ఎలా ఛేదించాడనే నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ తోనే హింట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రింగా రింగా రోజే అనే పాట మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

అనసూయమ్మ సమర్పణలో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ప్రేక్షకులకు అనుక్షణం ఉత్కంఠ రేకెత్తించే స్టోరీ, స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.ఈ సినిమాను డిసెంబర్ 1న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Related Articles

Back to top button