Entertainment

Jr NTR: భారతీయుడిగా నాకు గర్వకారణంగా ఉంది.. గోల్డెన్ గ్లోబ్ విజయంపై తారక్ అభినందనలు..


Rrr, Jr Ntr

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. తొలిసారి విశ్వ వేదికగా భారతీయ తెలుగు చిత్రం ట్రిపుల్ ఆర్ అవార్డు గెలుచుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ సృష్టించింది. అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా బెస్ట్ ఒరిజినల్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించింది. దీనిని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇందుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా ఈ సినిమా ప్రయాణంలో తాను భాగమైనందకు సంతోషంగా ఉందన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్ర విజయాన్ని సాధ్యం చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తోటి భారతీయుడిగా గర్వంగా ఉందని చెబుతూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

“ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికాలో ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలుసు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో రెండు కేటగిరిలలో నామినేట్ అయ్యింది. అందులో ఓ కేటగిరీలో కీరవాణి గారు అవార్డ్ పొందారు. ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప అద్భుతమైన పాటలను అందించారు కీరవాణి గారు. రాజమౌళి గారి శ్రమ.. కీరవాణి సంగీతంతో ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ అద్భుతమైన విజయం అందుకుంది. ఇందుకు తోటి భారతీయుడిగా గర్వకారణంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం గురించి మాట్లాడుతూ.. భారతీయులందరూ తమకు అందించిన ప్రేమ.. ఆప్యాయతతోనే ఇది సాధ్యమైందని.. దీనిని సినీ సోదరులు.. భారతీయ చలనచిత్ర సోదరులు అందించిన విజయం. జర్నలిస్టులు.. భారతీయ మీడియా.. మా కుటుంబసభ్యులు.. స్నేహితులు.. అభిమానులు అందించిన అద్భుతమైన విజయమే ఇది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తారక్… మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Advertisement

Related Articles

Back to top button