Gopichand: గోపిచంద్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. వేసవి బరిలో ‘రామబాణం’..
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మ్యాచో స్టార్ హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం రామబాణం. ఫ్యామిలీ అండ్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి ఏర్పడింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో రామబాణం సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉండనుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 5న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో అందరూ చక్కగా చదివి పరీక్షలు రాయాలని.. అలాగే వేసవి సెలవుల్లో అందరం కలుద్దాం అంటూ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రామబాణం టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఇందులో గోపిచంద్ సరసన డింపుల్ హయాతి నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్ అందరిని ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఈ సినిమా పై అంచనాలు మాత్రం భారీగానే నెలకొన్నాయి.
#Ramabanam hitting Theatres on May 5th!!@DirectorSriwass @vishwaprasadtg @DimpleHayathi @MickeyJMeyer @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/0sX11TXvc1
— Gopichand (@YoursGopichand) March 4, 2023
Advertisement
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి