Entertainment

Sita Ramam: సీతారామమ్‌లో హీరోయిన్‌గా మొదట అనుకుంది మృణాల్‌ను కాదట.. లక్కీ ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది ఎవరంటే..


Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కి సినిమా ‘సీతారామమ్‌’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన…

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కి సినిమా ‘సీతారామమ్‌’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతీ పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అద్భుత ప్రేమ కథను అంతే అద్భుతంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్‌ తన పాత్రతో మెప్పించింది. ఈ సినిమాతో మృణాల్‌ టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకోవడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సినిమాకే హైలెట్‌గా నిలిచిన సీతా పాత్ర కోసం మొదల మృణాల్‌ అనుకోలేదట. తొలుత సీత పాత్రలో పూజా హెగ్డేను అనుకున్నారట, కానీ కరోనా సమయంలో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకో పూజా ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని సమాచారం. పాత్ర నచ్చినప్పటికీ తప్పని పరిస్థితులో పూజా సినిమాకు నో చెప్పిందని తెలుస్తోంది. ఇలా పూజా చేయాల్సిన పాత్ర మృణాల్‌ కొట్టేసిందన్నమాట.

Pooja Hegde

ఒకవేళ ఈ సినిమాలో పూజా నటించి ఉంటే పాత్రకు మరింత వెయిటేజ్‌ దక్కేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే సీతా రామమ్‌ హౌజ్‌ ఫుల్‌ షోస్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ బజ్‌ తెచ్చుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

Advertisement



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button