Aata Sandeep,Bigg Boss Today Promo: ఆట సందీప్ పవరాస్త్ర మాయం.. రెచ్చిపోయిన మాస్టర్.. ‘సెన్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా రతీ’.. – aata sandeep pavarastra missing in the bigg boss house
మహాబలి టీం సభ్యులులో రతిక, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, దామినిలు ఉంటే.. రణధీర టీంలో శివాజీ, అమర్‌దీప్, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, షకీలా, ప్రియాంకలు ఉన్నారు. అయితే ఈ టాస్క్‌కి సంచాలకుడిగా ఉన్నారు ఆట సందీప్. పవరాస్త్రని సాధించి బిగ్ బాస్ ఇంటి మొట్ట మొదటి ఫైనలిస్ట్ అయిన ఆట సందీప్‌కి స్పెషల్ పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే రణధీర టీం నుంచి మాయాస్త్ర కీస్ కొట్టేయడానికి విశ్వప్రయత్నం చేసిన శుభ శ్రీ రాయగురు.. చివరికి ఆమె ప్రయత్నం విఫలం కావడంతో.. లగ్జరీ రూంలో ఉన్న ఆట సందీప్ పవరాస్త్రని కొట్టేసింది.
దీంతో హౌస్‌లో గందరగోళం నెలకొంది. పవరాస్త్రని కొట్టేసింది శుభ శ్రీ అని మహాబలి టీం సభ్యులందరికీ తెలుసు. కానీ తమకి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. దీంతో ఆట సందీప్.. ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నాడు తాజా ప్రోమోలో. ఇది కరెక్ట్ కాదు.. మరీ ఇంత ఛీప్ మెంటాలిటీ అనుకోలేదంటూ ఆట సందీప్ సీరియస్ కావడంతో.. ఛీపూ గీపు అనొద్దని పత్తిత్తులా మాట్లాడుతున్నాడు టేస్టీ తేజా.
మహాబలి టీం సభ్యులే తీసి ఉంటారని నాకు సెన్స్ కొడుతుంది అని శోభాశెట్టి అనడంతో.. ‘సెన్స్ ఉండి మాట్లాడు.. తెలియకుండా బ్లేమ్ చేయకు’ అని అంటుంది మన కన్నింగ్ లేడీ రతి పాప. పాపం ఆట సందీప్.. పిచ్చెక్కినట్టు ఇల్లు మొత్తం వెతుకున్నాడు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో ఏంటి బిగ్ బాస్ ఇదీ.. ‘నా రూంలోకి రావడానికి వాళ్లకి పర్మిషన్ లేదు.. నా పర్మిషన్ లేకుండా వాళ్లు హౌస్‌లోకి ఎలా వస్తారు? ఇది న్యాయం కాదు’ అంటూ ఆట సందీప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.