Aamani: క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమని షాకింగ్ కామెంట్స్.. ఫోన్ చేసి ఒంటరిగా రమ్మన్నాడంటూ.. | Senior Actress Aamani Open up About Casting Couch Experience in Industry telugu cinema news
ఒక దర్శకుడు తనను ఒంటరిగా రమ్మన్నాడని వెల్లడించారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
నటిగా.. హీరోయిన్గా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. కానీ ప్రతి అమ్మాయికీ ముందుగా ఎదురయ్యేది క్యాస్టింగ్ కౌచ్. ఇప్పుడు కాదు.. గత కొన్నేళ్లుగా ఈ సమస్యను ఫేస్ చేసినవాళ్లే ఉన్నారు. ఇప్పటికే కొందరు ఈ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులను బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ హీరోయిన్ ఆమని సైతం దీనిపై పెదవి విప్పారు. ఒక దర్శకుడు తనను ఒంటరిగా రమ్మన్నాడని వెల్లడించారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు.
కమల్ హాసన్, జగపతి బాబు వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ ఆమని. గ్లామర్ షోలకు ఏమాత్రం తావివ్వకుండా .. సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూనే అగ్రకథానాయికగా కొనసాగారు. ఇక ఇప్పుడు సహయ నటిగా రాణిస్తున్నారు. అయితే తాను సక్సెస్ అవ్వడం వెనక ఎన్నో కష్టాలు పడ్డానని అన్నారు. చిత్రపరిశ్రమలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడం ఎన్నో ఇబ్బందులు పడినట్లుగా తెలిపారు.
“ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. అడిషన్స్ కోసం కంపెనీలకు వెళ్తే.. కొన్ని కంపెనీల్లో సెలక్ట్ అయ్యేదాన్ని. మరికొన్నింట్లో రిజెక్ట్ చేసేవాళ్లు. అయితే కొందరు చెప్పి పంపిస్తామనే వాళ్లు. అంటే ఏంటో మొదట నాక్కూడా అర్థం కాలేదు. మేడమ్ డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేవాళ్లు. ఎందుకు అంటే మేకప్ టెస్ట్ అని చెప్పారు. అమ్మతో వస్తా అంటే వద్దు ఒంటరిగా రావాలి అనేవారు. వెంటనే అమ్మ.. తను ఒంటరిగా రాదు. ఇద్దరం కలిసే వస్తామని చెప్పింది. దీంతో వద్దనేవారు. అలా నాకు పోను పోనూ అర్థమైంది. అమ్మ లేకుండా నన్నొక్కదాన్నే ఎందుకు రమ్మంటున్నారో తర్వాత తెలిసొచ్చింది. ఇలా చాలా జరిగాయి. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకిష్టం లేదు. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్డ్వడానికి రెండేళ్లు పట్టింది” అంటూ చెప్పుకొచ్చారు ఆమని.