2k notes circulation, Makthal: ఇక్కడ రూ.2 వేల నోట్లు తీసుకోబడవు.. వైన్ షాపు ముందు బోర్డు – the board in front of the wine shop says that 2k notes will not be accepted
ఈ క్రమంలో రూ.2 వేల నోట్లు తీసుకోబడవంటూ ఓ వైన్ షాపు ముందు పెట్టిన బోర్డ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ పట్టణంలోని ఓ వైన్ షాపు ముందు ఒక వైట్ పేపర్‌పై రాసి పెట్టారు. ఈ వైన్ షాపు ఒక పార్టీ నేతకు సంబంధించినదిగా చెబుతున్నారు. రూ.2 వేల నోట్లు తీసుకోమంటూ బోర్డు పెట్టడంతో కొంతమంది ఆసక్తిగా చూస్తున్నారు. ఇలా బోర్డు పెట్టడంతో కొంతమంది మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు. గడువు ఉన్నా.. తీసుకోకపోవడంపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.
చిరు వ్యాపారులు రూ.2 వేల నోట్లను తీసుకోవడం లేదు. కానీ పెద్ద షాపింగ్ మాల్స్‌లలో మాత్రం రూ.2 వేల నోట్లను తీసుకుంటున్నారు. ఇక రూ.2 వేల నోట్ల ఉపసంహరణతో బంగారం అమ్మకాలు కూడా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో 5 నుంచి 10 శాతం వరకు బంగారం విక్రయాలు పెరిగిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆర్బీఐ నిర్ణయంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావటంతో బంగారం అమ్మకాలు పెరిగినట్టు యజమానులు చెబుతున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి రూ.2 లక్షల వరకు రూ.2 వేల నోట్లు తీసుకుంటున్నామని షాపు యజమానులు చెబుతున్నారు. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నామని, రద్దు చేయలేదని ఆర్బీఐ చెబుతోంది.
రేపటి నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం కల్పించింది. అయినా కొంతమంది వ్యాపారులు రూ.2 వేల నోట్లను తీసుకోవడం లేదు. తమకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందనే కారణంతో తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రజలు రూ.2 వేల నోట్లను ఏటీఎంలలో డిపాజిట్ చేస్తోన్నారు. ప్రజలకు తక్షణమే రూ.2 వేల నోట్లను ఇవ్వడం ఆపేయాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది.
- Read More Telangana News And Telugu News