విమానంలో మహిళపై మూత్ర విసర్జన.. ముంబై వ్యాపారవేత్త అరెస్ట్.. అసలేమైందంటే..? | Businessman Shankar Mishra Who Urinated On Woman On Flight Arrested In Bengaluru, To Be Produced Before Court Today
విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. మహిళపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.
విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. మహిళపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. న్యూయార్క్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడిని బెంగళూరులో అరెస్టు చేసినట్లు పోలసీులు తెలిపారు. శుక్రవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఢిల్లీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మిశ్రాను శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఉద్యోగం నుంచి శంకర్ మిశ్రాను తొలగించిన వెల్స్ ఫార్గో..
అంతకుముందు, యుఎస్ ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో.. శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలపై స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలవరపరిచే విధంగా ఉందంటూ అభిప్రాయపడింది. కంపెనీ ఉద్యోగులను వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రవర్తన, అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉందని.. ఈ ఆరోపణలు తమను తీవ్రంగా కలవరపెడుతున్నాయని.. పేర్కొంది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా.. శంకర్ పై వస్తున్న ఆరోపణలను అతని తండ్రి తోసిపుచ్చారు. ఇవి తప్పుడు ప్రచారం అంటూ పేర్కొన్నారు. శంకర్ మిశ్రాను సమర్థించిన తండ్రి శ్యామ్ మిశ్రా.. అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తన కొడుకు శ్యామ్ మిశ్రా ఫ్లైట్‌లో పడుకున్నాడని, అతను నిద్ర లేచిన తర్వాత ఎయిర్‌లైన్ సిబ్బంది అతనిని ప్రశ్నించారన్నారు. ఇది.. తప్పుడు కేసు అని.. తన కొడుకు 30-35 గంటలు నిద్రపోలేదు. రాత్రి భోజనం చేసిన తర్వాత, అతను సిబ్బంది ఇచ్చిన డ్రింక్ తాగి నిద్రపోయి ఉండవచ్చు. నాకు అర్థమైన దాని ప్రకారం.. అతను మేల్కొన్న తర్వాత ఎయిర్‌లైన్ సిబ్బంది అతన్ని ప్రశ్నించారు.. అంటూ పేర్కొన్నారు.
Air India passenger urinating case of Nov 26 | Accused S Mishra has been arrested from Bengaluru, says Delhi Police pic.twitter.com/sPJJrVlO9j
— ANI (@ANI) January 7, 2023
ఫిర్యాదులో మహిళ ఏం చెప్పిందంటే..
న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వెళుతుండగా మూత్ర విసర్జనకు గురైన బాధితురాలు జరిగిన ఘటనను వివరిస్తూ ఫిర్యాదు చేసింది. క్యాబిన్ సిబ్బంది నేరస్థుడిని తన పక్కనే కూర్చోమని బలవంతం చేసి, అతడిని మళ్లీ తన ఎదుటకు తీసుకొచ్చారని చెప్పింది. విశ్రా నిల్చొని తన ప్యాంట్‌ని విప్పి తనపై మూత్ర విసర్జన చేసాడంటూ ఫిర్యాదులో వివరించింది. గ్రీవెన్స్ ఎయిర్ సేవాకు చేసిన ఫిర్యాదు లేఖలో, ఆమె 70 ఏళ్ల వయస్సులో ఉన్న వృద్ధ మహిళ.. 26 నవంబర్ 2022న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ ఫ్లైట్ AI102, సీట్ 9A లో ప్రయాణిస్తుండగా.. తనపై మూత్ర విసర్జన జరిగిందని ఫిర్యాదు చేసింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, లంచ్ అందించి, లైట్లు ఆపిన కొద్దిసేపటికే 8Aలో కూర్చున్న ఓ ప్రయాణీకుడు మద్యం మత్తులో తన సీటు వద్దకు వచ్చాడని.. ఆ తర్వాత ప్యాంటు విప్పి తనపై మూత్ర విసర్జన చేసాడని తెలిపింది. తన దుస్తులు, బూట్లు, బ్యాగ్ మూత్రంలో తడిసిపోయాయని వివరించింది.
ఈ ఘటన అనంతరం ముంబైకి చెందిన వ్యాపారవేత్త శంకర్ మిశ్రాపై ఎయిర్‌లైన్ చర్యలు తీసుకుంది. తదుపరి 30 రోజుల పాటు ఆ వ్యక్తి ప్రయాణించకుండా నిషేధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి