News

విధిని తప్పించుకోవటం కష్టం.. ఇదే అందుకు సాక్ష్యం.. చూసుకుని వెళ్లినా దూసుకొచ్చిన ప్రమాదం



జనాల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. వచ్చేవి పోయేవి చూసుకోకుండా పాదాచారులు రోడ్లు దాటినప్పుడో.. లేదా బైకర్లు వెనుకవచ్చే వాటిని చూసుకోకుండా మలుపుల వద్ద చేస్తున్న విన్యాసాల వల్లో.. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లో చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటివాడు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా.. వాడితో పాటు మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే అవకాశాలున్నాయి. దాన్నే విధి అంటాం. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగాల్సింది జరగక మానదు అన్నది ఈ ప్రమాదం విషయంలో నిరూపితమైంది. జిల్లా మండలం వెంకటాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసి బస్సు అదుపుతప్పి ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లింది. బైకును ఢీకొట్టి రోడ్డు పక్కనున్న గుంతలోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో బైక్ మీద వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.నిజామాబాద్ డిపోకు చెందిన కోరుట్ల వైపు నుంచి జగిత్యాల వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డును దాటడం కోసం చాలా సేపు వెయిట్ చేశారు. అటువైపుగా ఏ వాహనాలు రావటం లేదని నిర్ధారించుకుననాక… రోడ్డు దాటేందుకు ముందుకు కదిలారు. అయితే.. రోడ్డు పూర్తిగా దాటేసి.. వాళ్ల దారిలోకి వెళ్లిన తర్వాత.. ఊహించని విధంగా ఓ ఆర్టీసి బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. నేరుగా వెళ్లకుండా పక్కకు తిరిగి అటుగా వెళ్తున్న బైకును ఢీకొట్టింది. బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు అదే వేగంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే చెట్టును ఢీకొట్టి ఆగిపోవటంతో బస్సులోని వారికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బండి మీద ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ దృశ్యాలు చూసిన వాళ్లంతా… విధిని ఎవ్వరూ తప్పించుకోలేరంటూ వాపోతున్నారు.

Related Articles

Back to top button