News

'మార్క్ ఆంటోని' రివ్యూ: విశాల్ 'మార్క్' సినిమా“ఛ.. ఆ రోజు అలా జరిగి ఉండకపోతే నా జీవితం మరోలా ఉండేది.. అవును ఆ క్షణం నేను అల ా చేసి ఉంటే లైఫే వేరేలా ఉండేది”.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్షణం ఇలా అనుకునే ఉంటారు.. అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. ఊహించని మలుపులతో కష్ట సుఖాల కలయికలతో సాగే హై టెన్షన్ థ్రిల్లింగ్ డ్రామానే జీవితం. సర్లే కానీ ఇప్పుడు ఇదంతా దేనికంటే.. టైమ్ ట్రావెల్ గురించి చెప్పడానికే.మనిషి ఎన్నో సాధించాడు.. ఊహకందనివన్నీ చేసి చూపించాడు. కానీ టైమ్ ట్రావెల్ అనేది మాత్రం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఎంతోమంది శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇక అనేక భాషల్లో ఈ కాన్సెప్ట్ మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఇక తాజాగా విశాల్ కూడా ‘మార్క్ ఆంటోని’తో ఈ టైమ్ ట్రావెల్‌ కథాంశాన్ని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంతుచిక్కని ఈ కాన్సెప్ట్ ఆడియన్స్‌కు ఎంతవరకు రీచ్ అయిందో చూద్దాం.ఇదీ కథగతానికి ప్రయాణించగలిగే ఓ ఫోన్‌ను కనిపెడతాడు సైంటిస్ట్ చిరంజీవి (సెల్వ రాఘవన్). సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఫోన్ సాయంతో గతంలో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయొచ్చు. అయితే ఈ ఫోన్‌ను కనిపెట్టిన చిరంజీవి.. క్లబ్‌లో జరిగిన ఓ గ్యాంగ్ వార్‌లో అనుకోకుండా బుల్లెట్ తగిలి చనిపోతాడు. అదే చోట గ్యాంగ్‌స్టర్ ఆంటోని (సీనియర్ విశాల్) కూడా చనిపోతాడు.దీంతో ఆంటోని కొడుకు మార్క్ (జూనియర్ విశాల్).. తన నాన్న ప్రాణ స్నేహితుడైన జాకీ ( సీనియర్ ఎస్‌జే సూర్య) దగ్గర పెరుగుతాడు. అయితే తన తండ్రి ఓ క్రూరమైన గ్యాంగ్‌స్టర్ అని.. తన తల్లిని చంపేశాడంటూ మార్క్ ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. కానీ జాకీ మాత్రం.. తన కొడుకు మదన్ మార్తాండ ( జూనియర్ ఎస్‌జే సూర్య) కంటే మార్క్‌నే ప్రేమగా చూస్తుంటాడు. కానీ తన తండ్రి కిరాతకుడని, తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కత్తులు, తుపాకులు పట్టుకోకుండా ఓ గ్యారేజ్ నడుపుకుంటూ మార్క్ బతుకుతుంటాడు. అయితే సైంటిస్ట్ చిరంజీవి తయారు చేసిన ఆ ఫోన్ మార్క్ కంటపడిన తర్వాత ఏం జరిగింది? తన తండ్రి గతం గురించి తెలుసుకున్న మార్క్ ఏం చేశాడు? అసలు కథలో నిజమైన విలన్ ఎవరు? అనేది మిగిలిన కథ.ఎలా చూపించారు? నిజానికి టైమ్ ట్రావెల్ అనేది ఓ కన్‌ఫ్యూజింగ్ కాన్సెప్ట్. కానీ దాన్ని ఆడియన్స్‌కి క్లారిటీగా చూపిస్తే మాత్రం సినిమాని నెత్తిన పెట్టుకుంటారు. అందుకే అప్పుడెప్పుడో వచ్చిన ‘ఆదిత్య 369’ నుంచి ఈ మధ్య వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ వరకు ఈ టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. ‘మార్క్ ఆంటోని’ విషయానికొస్తే డైరెక్టర్ ఎంచుకున్న సబ్జెక్ట్‌కి తిరుగులేదు. అయితే దాన్ని చూపించిన విధానం మాత్రం కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉంది. అదేదో ఓ మీమ్‌ ఉంటుంది కదా.. “ఇది కింది స్థాయి వాళ్లకి అర్థం కాదు.. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివుండాలి” అన్నట్లుగా కొన్ని సీన్లు ఉంటాయి. సినిమా స్క్రీన్‌ప్లే రేసింగ్‌‍గా సాగుతూ ఉంటుంది. అంటే తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్‌లా, రేసింగ్‌లో దూసుకుపోయే బైక్‌లా జమ్ జమ్ అంటూ పరిగెడుతూ ఉంటుంది. చూసే ప్రేక్షకుడు కూడా అంతే వేగంగా దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్లాలి. మొదటి సీన్ నుంచి చివరి వరకూ కళ్లప్పగించి చూస్తేనే సినిమాలో ఉన్న విషయం బుర్రకెక్కుతుంది. ఈ విషయం పక్కన పెడితే సినిమా మొత్తంగా అయితే ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సీన్.. బాగున్నాయి.ఎవరెలా చేశారు?విశాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటనలో ఆయనకి ఉన్న కమిట్‌మెంట్ మరోసారి తెరపై నూటికి నూరు శాతం కనిపించింది. ముఖ్యంగా ఆంటోని పాత్రలో విశాల్ నటన, యాక్షన్ సీన్లలో ఆ ఇంటెన్సిటీ బావుంది. ఇక విశాల్‌ను బీట్ చేసేలా ఎస్‌జే సూర్య యాక్ట్ చేశారు. సినిమా ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉందంటే దానికి కారణం సూర్యనే. ఎందుకంటే మొదటి నుంచి చివరి వరకు డబుల్ రోల్‌లో అటు జాకీగా ఇటు మదన్ మార్తాండగా సూర్య నటన అద్భుతంగా ఉంది. కామెడీ సీన్లలో కూడా బాగానే నవ్వించారు.ఇక మన తెలుగు నటుడు సునీల్‌ కూడా సినిమలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఏకాంబరం క్యారెక్టర్‌లో బాగానే పెర్ఫామ్ చేశాడు. ఇక హీరోయిన్ రీతూ వర్మ ఉన్నంతలో మెప్పించింది. ఇక మిగిలిన నటీనటులు కూడా ఫర్వాలేదనిపించారు. కానీ సినిమాలో ఎంత క్యాస్టింగ్ ఉన్నా మనకి మాత్రం డ్యూయెల్ రోల్ చేసిన విశాల్-ఎస్‌జే సూర్యలు మాత్రమే కనిపిస్తారు. ఇద్దరూ పోటాపోటీగా యాక్ట్ చేశారు. సినిమాలో సిల్క్ స్మిత ఎంట్రీ కూడా థియేటర్లో బాగానే పేలింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ గురించి చెప్పాలి. సినిమాను ఎత్తాలన్నా, ముంచాలన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌పైనే ఆధారపడి ఉందని ఈ మధ్య చాలా సినిమాలు నిరూపించాయి. విక్రమ్, కేజీఎఫ్.. ఈ మధ్య వచ్చిన జైలర్ సినిమాల విజయంలో బీజీఎమ్ కూడా కీలక పాత్ర పోషించింది. ఇక మార్క్ ఆంటోనిలో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగానే పేలింది. మొదటి సీన్ నుంచి ఎండ్ కార్డు వరకు జీవీ వాయిస్తూనే ఉన్నాడు. అసలు ఏం తాగి కొట్టావన్నా అన్నట్లుగా ఉంటంది బీజీఎమ్. ఓవరాల్‌గా సినిమా అయితే ఆకట్టుకుంటుంది.. కానీ చూసేటప్పుడు మాత్రం కాస్త కాన్సట్రేషన్‌గా చూడాలి.. లేకపోతే క్లారిటీ మిస్ అవుతుంది.ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘మార్క్ ఆంటోని’: విశాల్ ‘మార్క్’ కమ్ బ్యాక్

Related Articles

Back to top button