News
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఊరట.. కాకపోతే కండిషన్స్ అప్లై!
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ భూమా అఖిలప్రియకు ఊరట లభించింది. బుధవారం షరతులతో కూడిన బెయి మంజూరుకాగా.. జైలు నుంచి విడుదలయ్యారు. నంద్యాల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం చేశారంటూ నంద్యాల తాలుకా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈనెల 17 నుంచి ఆమె కర్నూలు ఉమెన్స్ జైలులో ఉన్నారు.. బెయిల్ కోసం ఆమె మూడో అదనపు జిల్లా కోర్టులో పిటిషిన్ దాఖలు చేయగా బుధవారం బెయిల్ వచ్చింది.అఖిలప్రియకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల తాలుకా పోలీసుస్టేషన్‌కు ప్రతి గురువారం, ఆదివారం వెళ్లి సంతకం చేయాలని షరతు విధించారు. ఇదే కేసులో అరెస్టైన మిగిలిన నిందితుల బెయిల్ విచారణ గురువారం జరగనుంది. సాయంత్రం 5.45 గంటలకు కారాగారం నుంచి విడుదలై అఖిలప్రియ ఆళ్లగడ్డకు వెళ్లిపోయారు.