News

మహిళలకు అలర్ట్.. వరుసగా తగ్గి ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే!Gold Price: ఈ పండుగ సీజన్‌లో ధరలు తగ్గుతున్నాయని బంగారం కొనుగోలు చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారా? అయితే, మీకో ఝలక్. వరుసగా దిగివచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. వరుసగా తగ్గి మూడు వారాల కనిష్ఠానికి దిగివచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ పెరగడం కాస్త ఆందోళన కలిగించే విషయమే. తులం రేటు మళ్లీ రూ. 60 వేల స్థాయి పైనే కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరుగుతుండడమే దేశీయంగా పెరుగుదలకు కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇవాళ తులం గోల్డ్ రేటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. పెరిగిన బంగారం ధరలుహైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు రూ. 100 పెరిగి రూ. 55 వేల 550 కి చేరింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 110 పెరిగి రూ. 60 వేల 600 వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ఇవాళ రూ. 55 వేల 700 కు చేరింది. మరోవైపు.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ రూ. 110 మేర పెరిగి రూ. 60 వేల 750 కి చేరింది. వెండి ధర.. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కిలో రూ. 600 పెరిగింది. ప్రస్తుతం కిలో రేటు ఢిల్లీలో రూ. 73 వేల మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేటు రూ. 600 పెరిగి రూ. 76 వేల స్థాయికి చేరింది. ఢిల్లీతో పోలిస్తే మన భాగ్యనగరంలో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే బంగారం రేటు మాత్రం తక్కువకే లభిస్తుంది.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు.. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఇవాళ గోల్డ్ రేట్లు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇవాళ దాదాపు 15 డాలర్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు 1962 డాలర్లకు స్థాయికి చేరింది. స్పాట్ సిల్వర్ రేటు 23. 08 వద్దకు చేరింది. ఇక భారత కరెన్సీ రూపాయి మారకం విలువ కాస్త పుంజుకుంది. ఇవాళ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 82. 953 వద్దకు దిగివచ్చింది.

  • Read Latest and

Related Articles

Back to top button