News

'బివేర్ ఆఫ్ స్కామర్స్'.. ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల ఫోటోలు, పేర్లతో పోస్టర్లు కలకలంహైదరాబాద్‌లో నేటి నుంచి రెండ్రోజుల పాటు కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎజెండా రూపొందించడంతో పాటు 18 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి, విధానాలపై ఈ సమావేశంలో అగ్రనేతలు చర్చించనున్నారు. ఈ నేపధ్యంలో నగరంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ‘కరప్ట్ వర్కింగ్ కమిటీ’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. పోస్టర్లపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల్లో కొందరు ఫోటోలను ముద్రించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫోటోలు, వారు చేసిన కుంభకోణాల వివరాలతో పోస్టర్లు వేశారు. ఇందులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్లు అంటించారు. బివేర్ ఆఫ్ స్కామర్స్ (స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి) అంటూ టాగ్‌లైన్‌తో ఈ పోస్టర్లు వెలిశాయి. వాల్ పోస్టర్లలో CWC నేతల పేర్లు, వారి పేరుతో స్కాములు

 • మల్లికార్జున ఖర్గే – నేషనల్ హెరాల్డ్ స్కాం
 • సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం, ఛాపర్ స్కాం
 • మన్మోహన్ సింగ్ – కోల్ అలోకేషన్ స్కాం
 • రాహుల్ గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం
 • ఏకే ఆంటోనీ – నేషనల్ హెరాల్డ్ స్కాం
 • మీరా కుమార్ – నేషనల్ హైవేస్ అథారిటీ స్కాం
 • దిగ్విజయ్ సింగ్ – రిక్రూట్ మెంట్ స్కాం
 • చిదంబరం – ఫోర్జరీ, స్టాక్ మార్కెట్, శారదా చిట్ ఫండ్, వీసా స్కాం
 • లాల్ థన్ వాలా – మధ్యాహ్న భోజన స్కాం, లాటరీ స్కాం
 • ముఖుల్ వాస్నిక్ – ఎలక్షన్ టికెట్ స్కాం, ప్రాపర్టీ టాక్స్ స్కాం
 • ఆనంద్ శర్మ – వాల్ మార్ట్ స్కాం
 • అశోక్ రావ్ చవాన్ – ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం
 • చరంజిత్ సింగ్ చన్నీ – స్పోర్ట్స్ కిట్, ప్రభుత్వ ఉద్యోగాలు, థీమ్ పార్క్ స్కాం
 • ప్రియాంక గాంధీ వాద్రా – నేషనల్ హెరాల్గ్ స్కాం, డీఎల్ఎఫ్ లాండ్ స్కాం,
 • అభిషేక్ మనుసింఘ్వీ – సీడీ రికార్డింగ్ స్కాం
 • జైరాం రమేష్ – కోల్ స్కాం
 • మహేంద్రజీత్ సింగ్ మాల్వియా – అసిస్టెంట్ ఇంజినీర్స్ ట్రాన్స్ ఫర్ స్కాం
 • కేసీ వేణుగోపాల్ – సోలార్ స్కాం
 • అధిర్ రంజన్ చౌదరి – శారదా స్కాం
 • అంబికా సోని – రైల్వే వాటర్ బాటిల్స్ స్కాం
 • అజయ్ మాకెన్ – రియల్ ఎస్టేట్ స్కాం
 • తామ్రద్వజ్ సాహు – ఆవు పేడ స్కాం
 • సల్మాన్ ఖుర్షీద్ – వీల్ చెయిర్ స్కాం
 • శశిథరూర్ – స్పాట్ ఫిక్సింగ్ స్కాం

సెప్టెంబర్ 17 సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తున్న సభకు హాజరవుతున్న అమిత్‌షా ను ప్రశ్నిస్తూ కూడా నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. గోవా లిబరేషన్ డేకు రూ.300 కోట్లు ఇచ్చిన మోదీ సర్కార్ తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేషన్ డేకు ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదు ? తెలంగాణకు వస్తున్న అమిత్ షా ఏమైనా ప్రకటిస్తారా ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో వృద్దాప్య పింఛన్ మా ముఖ్యమంత్రి కేసీఆర్ 2,016 రూపాయలు ఇస్తుంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇస్తున్న పింఛన్లు ఎంత ? అని ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు.

Related Articles

Back to top button