News

బండి సంజయ్ రాజీనామా.. ఇదేం డ్రామా?



మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారానికి తెరపడి పోలింగ్‌కు కేవలం గంటల వ్యవధే ఉన్న వేళ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఈ ఎన్నికలో బీజేపీ ఓటమి పాలవుతుందని ముందే గ్రహించి తెలంగాణ బీజేపీ చీఫ్ కుమార్ రాజీనామాకు సిద్ధమయ్యారట. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరుతో లేఖను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారట. తెలంగాణలో ఇప్పుడు ఈ అంశం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయాలు ఈ లేఖ వైపు మళ్లాయి. బండి సంజయ్ లెటర్ ప్యాడ్‌తో అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై బండి సంజయ్ కూడా స్పందించారు. ‘ఫాం హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో, టీఆర్‌ఎస్ మోసగాళ్లు మరో కొత్త నాటకానికి తెరలేపారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైరల్ అవుతున్న ఆ లేఖ ఫేక్ అంటూ ట్విటర్ వేదికగా కొట్టి పడేశారు.

Related Articles

Back to top button