News
ప్రధాని మోదీ బర్త్‌డే వేళ కేక్ కట్ చేసిన పాక్ మహిళ
: సీమా హైదర్. ఈ మహిళ మీకు గుర్తుందా. పబ్జీలో పరిచయమైన ఉత్తర్‌ప్రదేశ్ యువకుడి కోసం ఏకంగా పాక్‌లోని ఇంటిని అమ్మేసుకుని.. నలుగురు పిల్లలతో సహా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల తనిఖీల్లో వ్యవహారం మొత్తం బయటపడటంతో ఆమె దేశవ్యాప్తంగా కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అడపాదడపా వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఆదివారం ప్రధాని సందర్భంగా కేక్ కట్ చేసి, క్యాండిల్స్ వెలిగించి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి ప్రధాని ఎంతో ఖ్యాతి తెచ్చారని సీమా హైదర్ ఆ వీడియోలో వెల్లడించింది. వీడియో చివర్లో ‘హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు కూడా చేసింది. అయితే ఆమె ప్రధాని నరేంద్ర మోదీ మీద, భారతదేశం మీద అభిమానం, ప్రేమ చూపించడం ఇది కొత్తేమీ కాదు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేసింది. కుటుంబ సభ్యులతో కలిసి జెండా వందనం చేసి భారత్ మాతాకీ జై, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా చేసింది. ఆ తర్వాత రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ పెద్దలందరికీ రాఖీలు పంపించింది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు లేఖ కూడా రాసింది సీమా హైదర్. కరోనా వేళ పాక్ మహిళ సీమా హైదర్ పబ్జీ ఆడుతుండగా.. ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాకు చెందిన సచిన్ మీనా అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్.. పాక్ నుంచి నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. జూలై 4 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తనిఖీలు చేయగా.. ఆమె పాకిస్థాన్ నుంచి నలుగురు పిల్లలతో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి నివసిస్తోందని గుర్తించారు. వెంటనే ఆరా తీయగా.. , సచిన్ మీనా గురించి విషయాలు తెలిశాయి. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. జూలై 7 వ తేదీన వారికి బెయిల్ వచ్చింది. ఆమె పాకిస్థాన్ నుంచి రావడంతో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు, యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ సహా వివిధ ప్రభుత్వ సంస్థలు వేర్వేరుగా దర్యాప్తు ఇంకా కొనసాగిస్తునే ఉన్నాయి.Read More And